BigTV English

India Global Forum : ఆవిష్కరణలకు పెద్దపీట.. ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల ఐక్యవేదిక

India Global Forum : ఇండియా గ్లోబల్ ఫోరమ్ (India Global Forum -IGF)అనే సంస్థ నవంబర్ 26-29, 2023 వరకు యుఎఈ(UAE) దేశంలో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో భారత్, యుఎఈ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలు, టెక్నాలజీ నిపుణులు తమ దేశాలలో ఉన్న వ్యాపార అవకాశాలు, వనరులను విస్తృతస్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై చర్చించనున్నారు.

ముఖ్యంగా ఇండియా, యుఎఈ, ఆఫ్రికా దేశాల వ్యాపారవేత్తలు.. టెక్నాలజీ, బిజినెస్ పరంగా పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ వార్మింగ్(వాతావరణ కాలుష్యం) సమస్య, దాని పరిష్కారం కోసం టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే కీలక అంశాలపై కూడా దృష్టి సారిస్తారు. గ్లోబల్ వార్మింగ్ ఒక సమస్య వేగంగా పెరుగుతుండడంతో దాని దుష్ప్రభావాలు ప్రజారోగ్యం, వ్యవసాయ రంగాలపై ఎక్కువగా కనిపిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలు, యంత్రాలను ఆవిష్కరణ ప్రాముఖ్యంపై నిపుణులు ప్రసంగిస్తారు.

దుబాయ్‌లో జరిగే ఈవెంట్‌లో 120 మందికిపైగా ప్రముఖులు.. చర్చలు, ప్రసాంగాలు చేయనున్నారు. వీరందరూ తమ దేశాలు కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో ఎలా ఎదగాలనే అంశాలపై ప్రణాళికలు, తమ అభిప్రాయలను పంచుకుంటారు. ఈ అంతర్జాతీయ సమావేశం పామ్ దుబాయ్‌లోని తాజ్ ఎక్సాటికా హోటల్‌లో మూడు రోజులపాటు జరుగనుంది.

2022లో కూడా యుఏఈ దేశంలో IGF ఇలాంటి సమావేశాన్నే నిర్వహించింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్. యస్. జైశంకర్ సమావేశంలో పాల్గొని.. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌పై కీలక సూచనలు చేశారు.

ఇండియా గ్లోబల్ ఫోరమ్ అంటే IGF.. అనే సంస్థ దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను పెంపొందించడానికి సమావేశాలు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ప్రముఖులు, పలు రంగాలలో నిపుణులు, విధాన రూపకర్తలను కనెక్ట్ అవడానికి ఈ సంస్థ ఒక ప్లాట్‌పార్మ్‌గా పనిచేస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×