Oil Tanker Accident: ఆయిల్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో అటు వైపు వస్తున్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఫలితంగా 31 మంది సజీవ దహనమయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరో సిటీలో జరిగింది. అసలు ఘటన ఎలా జరిగింది?
రాత్రి ఈజిప్టు రాజధాని కైరో ఓటర్ రింగు రోడ్డు వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్.. కైరో సిటీలోని ఓటర్ రింగురోడ్డు వద్ద మలుపు తీసుకుంటోంది. ఈ సమయంలో స్టీరింగ్ తిరగకపోవడంతో ఒక్కసారి వాహనం బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లోని చమురు రహదారి అంతా వ్యాపించింది. ఆ తర్వాత నిప్పు అంటుకోవడం మొదలైంది. ఈ ఘటనలో రెండు డజన్లకు పైగానే కార్లు, మోటార్‌సైకిళ్లు కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్లలోని మంటల నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తానాదాలు పెట్టడం అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. చాలామందిని స్థానికులు రక్షించారు. ప్రమాదం గురించి తెలియగానే ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఘటనా స్థలంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫతా అల్-సిసి. బాధితులకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల కోసం దాదాపు 40 అంబులెన్సులు మోహరించాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈజిప్టులో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మరణిస్తున్నారు. ఆ దేశం రోడ్డు భద్రత రికార్డు చాలా అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయకపోవడం ప్రమాదాలకు కారణాలుగా మారాయి. ఈ ఏడాది జనవరిలో ఈజిప్టులోని బెని సుయెఫ్ సమీపంలో జరిగిన ఘోరమైన ప్రమాదంలో 21 మంది మరణించిన విషయం తెల్సిందే.
BREAKING: Reports of more than 30 people killed after a truck carrying petroleum products overturned while turning on Cairo’s Ring Road, triggering a massive explosion and fire that spread to several nearby vehicles, according to Egypt’s Health Ministry. pic.twitter.com/7lJKLTR2Rs
— Breaking911 (@Breaking911) November 25, 2026