BigTV English

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి అరవింద్ మణి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు అక్కడ లేడు.


టెక్సాస్‌లోని లాంపాసాప్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్నారై ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు స్పాట్‌లో మృతి చెందారు. వారిలో అరవింద్ మణి (45), ప్రదీపా అరవింద్ (40), ఆండ్రిల్ అరవింద్ (17) ఉన్నారు. అయితే వీరికి 14 ఏళ్ల కొడుకు ఆదిరియన్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు వాహనంలో లేడు.

అరవింద్ మణి ప్రయాణిస్తున్న కారును, ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఆ కారు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని టెక్సాస్ డిపార్టెమెంట్ ఆప్ ఫబ్లిక్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కార్లకు సంబంధించి మొత్తం ఐదుగురు మృతి చెందగా, అందులో మణి కుటుంబసభ్యులు ముగ్గురు ఉన్నారు.


ALSO READ: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

అతి వేగమే ఈ ఘటనకు కారణమైందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నమాట. గడిచిన 26 ఏళ్లలో ఆ తరహా ప్రమాదం జరగలేదని అంటున్నారు. అరవింద్ మణి కూతురు ఆండ్రిల్‌ రీసెంట్‌గా హైస్కూల్ పూర్తి చేసింది. డల్లాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని భావిస్తోంది. ఇంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అరవింద్ మణి కొడుకు ఆదిరియన్ తొమ్మిది చదువుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు.

 

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×