Big Stories

AP Government Officers Transfers: ఏపీ ప్రభుత్వ అధికారుల ఏరివేత షురూ

Andhra Pradesh Government Officers Transfers: మార్పు.. యస్.. ఏపీలో చాలా మార్పులు.. ప్రభుత్వం మారింది.. సీఎం మారారు.. పాలన తీరు మారింది.. పాలించే విధానం మారింది. ఇప్పుడు పాలన వ్యవస్థలో కూడా మార్పులు మొదలయ్యాయి. సమర్థత అనే ఏకైక అర్హతతో ఇప్పుడు చాలా మార్పులు మనకు కనిపించబోతున్నాయి. ఇంతకీ ఏపీ అడ్మినిస్ట్రేషన్‌లో జరుగుతున్న.. జరగబోయే మార్పులు ఏంటి? చంద్రబాబు ఎలాంటి విషయాలపై ఫోకస్ చేస్తున్నారు?

- Advertisement -

నారా చంద్రబాబు నాయుడు.. నవ్యాంధ్ర నూతన సీఎం.. ఆయన పాలన కూడా చాలా నూతనంగా ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదట ఐదు హామీల అమలుపై ఫోకస్ చేశారు. వాటికి సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఆయన ఎంత వేగంగా సంతకాలు చేశారో.. ఉన్నతాధికారులు కూడా అంతేవేగంగా పనిచేయాలని ఆదేశాలు వెళ్లిపోయాయి. సో.. పాలనలో తన మార్క్‌ చూపించడం మొదలుపెట్టేశారని తెలిసిపోతుంది.

- Advertisement -

సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అక్కడే ప్రకటించారు.. పాలన.. ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పినట్టుగానే అక్కడి నుంచే ఆయన ప్రక్షాళన మొదలైంది. మొదట తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించేశారు. ఆయన స్థానంలో శ్యామలరావును నియమించేశారు. సో.. తాను ఏదైతే చెప్పారో.. దానిని చేసి చూపించారు. మరి అక్కడితో ఆగిందా ఆయన ప్రక్షాళన.. లేదు.. ఒక్క టీటీడీ మాత్రమే కాదు. రాష్ట్రప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలపై ఫోకస్ చేశారు. మార్పు అన్ని విభాగాల్లో జరిగే విధంగా సీఎం కసరత్తు మొదలు పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో జరిగిన భేటీలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారు సరైన విధానాలు పాటించలేదు. చట్టాన్ని మీరి తమ అధికారాలను ఉపయోగించారు. అప్పటి పాలకుల అడుగులకు మడుగులొత్తారు. ఇవీ ఆయన చేసిన వ్యాఖ్యలు.. మరి చంద్రబాబు సీఎం.. ఆయన వ్యాఖ్యలు చేసి ఊరుకోరు కదా.. ఇప్పుడు అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు కసరత్తు ప్రారంభించారు. సీఎంవో, సీఎస్, డీజీపీలతో భేటీ ఆయ్యారు. వైసీపీతో అంటకాగిన వారిని.. జగన్‌కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని ఇలా అందరి చిట్టా తీస్తున్నారు. వారిని దూరంగా పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అయితే మనం మార్పులు చేర్పులను చూడబోతున్నాం.

మరి కొత్తగా ఎవరిని నియమించబోతున్నారు చంద్రబాబు.. ఇది అసలైన క్వశ్చన్.. సమర్థులైన అధికారులు.. నిబంధనల ప్రకారం పనిచేసేవారు. ఇప్పుడు వీరికే కీలక పోస్టింగ్స్‌ దక్కబోతున్నాయి. అంతేకాదు CMOలోకి కొందరు కీలక అధికారులను తీసుకురాబోతున్నారు చంద్రబాబు.. IASలు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీకి చెందిన ఏవీ రాజమౌళి 2003 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్.. 2014 టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా సీఎంవోలో కీలకంగా పనిచేశారు.

Also Read: ఏపీలో రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

రాజమౌళిప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌స్టేట్‌ క్యాడర్‌ డిప్యుటేషన్‌పై ఆయనను ఏపీకి పంపించాలని చంద్రబాబు కేంద్రానికి ఓ లెటర్ పంపారు. ఇక కార్తికేయ మిశ్రా 2009 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.. ఆయన ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనను రిలీవ్‌ చేసి ఏపీకి పంపాలని కూడా కేంద్రానికి రిక్వెస్ట్ పంపారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ సర్కార్‌లో చాలా కీలకం కాబట్టి వీరిద్దరు త్వరలోనే ఏపీకి రావడం కన్ఫామ్.. సీఎంలో కీలక బాధ్యతలు చేపట్టడం కూడా కన్ఫామ్.

ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్రను అపాయింట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర 1996 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. 2014లో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. సో చంద్రబాబు తన టీమ్‌ను మళ్లీ ఒక్కొక్కరిని అపాయింట్ చేస్తూ వస్తున్నారు. త్వరలో అన్ని విభాగాల అధికారులు కూడా మారిపోనున్నారు.

ఇది అధికారుల విషయం.. ఇక పాలన పరమైన నిర్ణయాల విషయానికి వస్తే.. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి డెవలప్‌మెంట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు రెడీ అయిపోయారు. ఇక అమరావతి విషయానికి వస్తే.. గతంలో CRDAలో పనిచేసిన అధికారులను పిలిపించుకుంటున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన పార్థసారథితో చర్చించారు. నిజానికి ఆయన రిటైర్డ్ అయ్యారు.. కాని ఆయనకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి పాలన.. ప్రక్షాళన అన్న పదాలకు పూర్తి స్థాయిలో చంద్రబాబు న్యాయం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News