BigTV English

Russian Influencer: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కు 8 ఏళ్ల జైలు శిక్ష.. ఏమైందంటే.?

Russian Influencer: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కు 8 ఏళ్ల జైలు శిక్ష.. ఏమైందంటే.?

Russian Influencer Sentenced 8 Years in Prison: సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం..సోషల్ మీడియాలో ఏది వస్తే చాలు దాన్నే చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఒకరు ఫేమ్ కోసం తన సొంత కొడుకు ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఏడాది క్రితం ఈ సంఘటన జరగగా తాజాగా అతడికి కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


రష్యాకు చెందిన మాక్సిమ్‌ లైయుటీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఇతడు పచ్చి కూరగాయలు తినాలంటూ ప్రత్యేక డైట్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసేవాడు. అయితే సోషల్ మీడియాలో తోచింది చెప్పడమే కాకుండా నెల వయస్సు ఉన్న తన కొడుకుపై ప్రయోగం ప్రారంభించాడు. భార్యను బిడ్డకు పాలివ్వద్దంటూ సూర్యరశ్మి అతడికి ఆహారమంటూ వారించేవాడు. సూర్యరశ్మితోనే ఎంత కాలమైన బ్రతకొచ్చని యూజర్లకు తెలియచేయడానికి బిడ్డపై ప్రయోగాలు చేశాడు. అతడికి తెలియకుండా బిడ్డకు పాలు పట్టేది ఆ తల్లి. శిశువుకు సరిపడా పాలు అందకపోవడంతో అనారోగ్యపాలయ్యాడు. దీంతో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లగా అప్పటికే చేయి దాటిపోవడంతో బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

Russian Influencer Sentenced 8 Years in Prison
Russian Influencer Sentenced 8 Years in Prison

ఈ సంఘటన ఏడాది క్రితం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య , భర్తలిద్దరిపై కేసు నమోదు చేశారు. బిడ్డ అనారోగ్య పాలయినా.. సూర్య రశ్మితో రోగనిరోధక శక్తి పెరిగి బిడ్డ కోలుకుంటాడని మాక్సిమ్‌ తమకు చెప్పేవాడని అతడి స్నేహితులు తెలిపారు. అంతేకాకుండా చిన్నారిని చన్నీటిలో ముంచేవాడని అన్నారు. చల్లటి నీటితో శరీరం దృఢంగా తయారవుతుందని వారించేవాడని పోలీసులకు చెప్పారు.


ALSO READ :Rains on Dubai: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

మాక్సిమ్‌ తన భార్య పౌష్టికాహారం తీసుకోలేక పోవడం వల్లే బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడని పోలీసులకు చెప్పాడు. కానీ విచారణలో అతడి భార్య మాత్రం అసలు విషయం చెప్పడంతో ఇమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మాక్సిమ్‌ నేరం చేసినట్లు ఒప్పకున్నాడు. దీంతో తాజాగా కోర్టు అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×