BigTV English

AC Best Temperature : ఏసీ వాడుతున్నారా.. అయితే టెంపరేచర్ ఎంత ఉండాలంటే!

AC Best Temperature :  ఏసీ వాడుతున్నారా.. అయితే టెంపరేచర్ ఎంత ఉండాలంటే!

Air Conditioner Best Temperature : ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫలితంగా ప్రజలు ఉపశమనం కోసం ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు మీ గది ఉష్ణోగ్రత మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గదిని చల్లగా ఉంచడం ద్వారా గాఢమైన మంచి నిద్రకు దారితీస్తుందని తెలిపింది. మంచి నిద్ర కోసం గది ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండటం అవసరమని సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో నలుగురు చెప్పారు. ఇది గది ఉష్ణోగ్రతను ఎంత తక్కువగా ఉంచాలనే దానిపై ఆధారపడి ఉంటుంది? గాఢ నిద్ర కోసం గది ఉష్ణోగ్రత ఎంత ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: సడెన్‌గా కండరాలు పట్టేస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు!

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రశాంతమైన లోతైన నిద్ర కోసం గది ఉష్ణోగ్రత 18.3 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలి. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎక్కువ లేదా తక్కువ ఉంచుకోవచ్చు. అయినప్పటికీ చాలా మంది వైద్యులు గది ఉష్ణోగ్రతను 15.6 నుండి 19.4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం లోతైన నిద్రకు ఉత్తమమని చెబుతున్నారు.ఇది మీ శరీరానికి సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల సాయంత్రం తర్వాత ఉష్ణోగ్రత తగ్గుదలకు మన శరీరం గ్రహిస్తుంది .బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే గది ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా మీరు నిద్రపోయే సమయం అని మీ శరీరానికి మెదడు మేసేజ్ ఇస్తుంది.


AC Temperature
AC Temperature

చాలా మంది చిన్న పిల్లలకు ఎయిర్ కండీషనర్ టెంపరేచర్ తక్కువగా పెట్టడం వల్ల చలి ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల వేసవిలో తమ గది ఉష్ణోగ్రత ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. చెప్పాలంటే..  గది ఉష్ణోగ్రత 20.5 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచినట్లయితే వారు ప్రశాంతమైన నిద్రను అనుభవిస్తారు. మేల్కొన్నప్పుడు మంచి అనుభూతి చెందుతారు. నిజానికి పిల్లల శరీరం చాలా చిన్నగా అభివృద్ధి దశలో ఉంటుంది. చిన్న పిల్లల ఉండే గది ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటే ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ సంభవించే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల వైద్యులు పిల్లల గది ఉష్ణోగ్రతను సరిగ్గా ఉంచాలని సూచిస్తున్నారు.

Also Read: ఈ ఐదు స్టెప్స్‌తో బరువు తగ్గడం ఈజీ..!

వైద్యుల ప్రకారం.. చిన్న పిల్లలు భారీ దుప్పట్లు లేదా మెత్తని బొంతల కింద పడుకోకూడదు. వారి శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా దుస్తులు ధరించాలి. తల్లితండ్రులు నిద్రించే సమయంలో పిల్లల పొట్ట, మెడ వెనుక భాగాన్ని తాకి పిల్లల శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందో లేదో చూసుకోవాలి. పిల్లలు 11 వారాల వయస్సులో ఉష్ణోగ్రత పరంగా పరిణతి చెందుతారని అనేక పరిశోధనల్లో తేలింది.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×