BigTV English

Rains on Dubai: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

Rains on Dubai: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

Dubai Airport flooded: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు, రోడ్డు చెరువుల్లా మారిపోయాయి. ఎక్కడ చూసినా వరద దృశ్యాలు కనిపిస్తున్నాయి.  కురుస్తున్న భారీ వర్షాలకు షాపింగ్ మాల్స్, ఇళ్లు, వీధులు, రహదారులు, ఎయిర్‌పోర్టు జలమయమయ్యాయి. ఒక్క దుబాయ్‌లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.


భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నీట మునిగింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ట్రావెలర్లు, బయటకు వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే కనిపిస్తోంది. దీంతో అరగంటపాటు కార్యకలాపాలను నిలిపివేశారు. ఎయిర్‌‌‌పోర్టు లోపలికి నీరు చేరుకుంది. అటు మెట్రో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Dubai Airport flooded
Dubai Airport flooded

ఒమన్‌లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 18కి చేరింది. ఆ సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు నష్టాన్ని అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు అధికారులు. చాలామంది ఆచూకీ తెలియరాలేదు. ఇంకా భారీ వర్షాలు పడే అవకాశముందని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో దుబాయ్, అబుదాబి, షార్జా, అరబ్ ఎమిరేట్స్‌లోని పలుప్రాంతాల్లో భారీగా వర్షం పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


ఇక ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా చివర తాకుతూ ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఇక యూఏఈ లోని దాదాపు అన్ని పాఠశాలలను మూసివేశారు. అక్కడ పనిచేసే కార్మికులు తమతమ కంపెనీల్లోనే ఉండిపోయారు. లోతైన ప్రాంతాల్లో నీటిని తోడేందుకు అధికారులు ట్యాంకర్లను హైవేలపైకి పంపించారు. ప్రస్తుతానికి సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాకపోతే వర్షం పడితే మళ్లీ కష్టమేనని అంటున్నారు.

 

Tags

Related News

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Big Stories

×