E-Paper
Advertisement

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై
Advertisement

Iran Attacks: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? శాంతి చర్చలంటూ ఇరాన్ -అమెరికాలు దాడులకు దిగుతున్నారా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ప్రపంచ దేశాలను ఇప్పుడు కలవర పెడుతున్న అంశం ఇదే. రేపు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలా దేశాలను వెంటాడుతున్నాయి.

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చర్చల సారాంశం ఏంటో తెలీదుగానీ, కాల్పుల విరమణ పేరుతో ఇరుదేశాలు ఒకరిపై మరొకరు దాడులు దిగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ప్రాంతంలోని కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల్లో అమెరికా స్థావరాలు లక్ష్యంగా విరుచుకుపడింది ఇరాన్‌. బుధవారం వేకువ జామున నుంచే భారీ ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి.

పరిస్థితి గమనించిన ఆయా దేశాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్‌ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్‌ వ్యవస్థలు అడ్డు కున్నాయని కువైట్‌ ఆర్మీ జనరల్‌ వెల్లడించారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్‌‌లో సైరన్‌లు మోత మోగింది. సైన్యం రంగంలోకి దిగడంతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు

పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా చర్యలకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిందని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి పేర్కొంది. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపంలో అమెరికా చర్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, ఆ ప్రాంతంలోని మరో వైమానిక స్థావరంపై తాము దాడి చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన వాదనలను యూఎస్ సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. కువైట్‌పైకి ప్రయోగించిన రెండు ఇరాన్ క్షిపణులు లక్ష్యాన్ని చేరక ముందే విఫలమయ్యాయి.

ALSO READ: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవు

మార్గమధ్యంలో క్షిపణులు ముక్కలైపోయాయి. బహ్రెయిన్‌పైకి ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా-బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకున్నాయి. ఇదిలావుండగా ఖేష్మ్‌ ద్వీపంపై దాడికి ప్రతి స్పందనగా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ వెల్లడించింది.

శత్రు దురాక్రమణలకు ప్రతిస్పందన ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఇరాన్‌ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తాము వెనుకాడబోమని తేల్చిచెప్పింది. బహ్రెయిన్‌లోని యూఎస్‌ నేవీ కార్యాలయం, మరో అమెరికా వైమానిక స్థావరంపై విజయవంతంగా దాడి చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది.

 

Related News

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

Big Stories

Advertisement
×