E-Paper
Advertisement

బీజేపీ లేకపోతే తెలంగాణే లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఢిల్లీలో ఎన్డీయే కూటమి గర్జన!

బీజేపీ లేకపోతే తెలంగాణే లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఢిల్లీలో ఎన్డీయే కూటమి గర్జన!
Advertisement

Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయడంలో కాంగ్రెస్ ఫెయిలయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ లో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ సిన్హా హైజరై అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల జ్ఞాపకాలతో కూడిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నిర్మిస్తోందన్నారు. బీబీనగర్ లో ఎయిమ్స్ నిర్మించినట్లు చెప్పారు. వికసిత్ భారత్ లో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని కొనియాడారు.

రాంచందర్ రావు మాట్లాడుతూ..

Advertisement

అనంతరం బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. జనసేన ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉందన్నారు. జనసేన, పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ కు అక్బరుద్దీన్ కి నిర్మల్, బోధన్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అనుమతి ఇస్తారని, కానీ అదే.. కాంగ్రెస్..,జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్ కి ఇది నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీయేగా తప్పుబడుతున్నట్లు స్పష్టంచేశారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..

Advertisement

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఏపీకి వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ప్రశ్నించారు. తమ ఉనికికి ప్రమాదం వచ్చిందనుకున్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతారని చురకలంటించారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు అడ్డంరాని తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తినే రోజు కేసీఆర్ పక్కనే కవిత ఉంది కదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయలేదా అని రఘునందన్ ఫైరయ్యారు.

బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు

కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటారని, అయితే.. పక్క రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి కూడా మాట్లాడుతుంటారని, జనసేనకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పవన్ వచ్చి మాట్లాడితే ఎందుకంత ఆందోళన చెందుతున్నారని నిలదీశారు. ఏ నాయకుడు ఎక్కడికైనా వెళ్లి సభ పెట్టుకోవచ్చన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారని, తమ భాగస్వామ్య పార్టీలు తమకు అండగా ఉండటాన్ని స్వాగతిస్తామన్నారు. ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని ఆయన సూచించారు. బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడమే అసలు సిసలైన నివాళి అని రఘునందన్ రావు తెలిపారు.

Also Read: నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×