E-Paper
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన.. కొత్త దశలోకి హోర్ముజ్ జలసంధి, అయితే..

Mojtaba Khamenei:  ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన.. కొత్త దశలోకి హోర్ముజ్ జలసంధి, అయితే..
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్టేనా? రేపో మాపో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చల మొదలు కానున్నాయా? హోర్ముజ్ జలసంధి విషయంలో కొత్త దశ మొదలైందని ఇరాన్ సుప్రీం ఎందుకన్నారు? రానున్న కొత్త దశ ఏంటి? ఇవే ప్రశ్నలు చాలా దేశాలను వెంటాడుతున్నాయి.

కొత్త దశలోకి హోర్ముజ్ జలసంధి

Advertisement

హోర్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ. హోర్ముజ్ జలసంధి నిర్వహణ కొత్త దశకు చేరుకుంటుందన్నారు. ప్రపంచంలో కీలకమైన జలమార్గాల్లో హోర్ముజ్ నిర్వహణ నూతన అధ్యాయంగా అభివర్ణించారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు తాము పరిహారం కోరాలని భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.

జరిగిన నష్టానికి, అమర వీరుల త్యాగాలకు పరిహారం కోసం కచ్చితంగా డిమాండ్ చేస్తామన్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఆయన ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణ కాలంలో ఇరాన్ అనుసరిస్తున్న విస్తృత వ్యూహంలో భాగంగా ఈ చర్య ఉందని ఖమేనీ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు అధికంగా ఉన్నప్పటికీ అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో సంఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు.

Advertisement

ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన

తాము యుద్ధాన్ని కోరుకోలేదని, మాకు అది అక్కర్లేదన్నారు. అయితే తమ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడబోదని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధమైన హక్కులను వదులుకోబోమన్నారు. అదే సమయంలో లెబనాన్‌లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ప్రాంతీయ మిత్రదేశాలతో సంఘీభావాన్ని నొక్కి చెప్పారు.

రెండు వారాల కాల్పుల విరమణ అమెరికా ప్రకటించినప్పటికీ, పౌరులు రాజకీయంగా చురుకుగా ఉండాలని పిలుపు నిచ్చారు ఖమేనీ. ప్రజా వేదికలపై మీ గళాలు చర్చల ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని, ప్రజా ప్రదర్శనలు ఇకపై అవసరం లేదని భావించకూడదన్నారు. చర్చల సమయంలో దేశీయ మద్దతు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ALSO READ: ప్రపంచాన్ని కాపాడామంటూ పాక్ డబ్బా.. మీమ్స్‌తో కుమ్మేస్తున్న భారత, ఇరాన్ యూజర్లు

దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఐఆర్‌జీసీ కొత్త రూల్స్ తెరపైకి తెచ్చిందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ రోజు కేవలం 15 నౌకలను అనుమతించాలని డిసైడ్ అయినట్టు పేర్కొన్నారు.

ఇరాన్ అనుమతి తీసుకున్న నౌకలకు జలసంధి ద్వారా ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. హోర్ముజ్‌ జలసంధిలో సీమైన్స్ వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇదివరకు ఇరాన్ హెచ్చరించింది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×