E-Paper
Advertisement

Iran North Korea nuke link: కిమ్ మామ పంట పండింది.. యుద్ధంలో వేలు పెట్టేందుకు గోల్డెన్ ఛాన్స్, రేపో మాపో..

Iran North Korea nuke link: కిమ్ మామ పంట పండింది.. యుద్ధంలో వేలు పెట్టేందుకు గోల్డెన్ ఛాన్స్, రేపో మాపో..
Advertisement

Iran North Korea nuke link: మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉత్తర కొరియా సాయం పొంది ఉండవచ్చని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం 72 గంటల వ్యవధిలోనే ప్యాంగ్యాంగ్ నుంచి అణు ఆయుధాలు విమానాల ద్వారా రష్యా మీదుగా ఇరాన్‌కు చేరుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. చైనా-రష్యా దేశాల అండ‌గా ఇరాన్ ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న సహకారం ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమించిందని బోల్టన్ విశ్లేషించారు. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పటికీ మిత్రదేశాల సాయంతో ఆ దేశం అణు ఆయుధాలను పొందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

యుద్ధం కారణంగా ఇరాన్‌లో మతపరమైన ఉగ్రవాద పాలన అంతం కావడం మంచిదేనని.. భవిష్యత్తులో అక్కడ సైనిక పాలన వచ్చినా లేదా ప్రజాస్వామ్యం ఏర్పడినా ప్రస్తుత ఛాందసవాద ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉంటుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.ఇరాన్‌కు అణు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా ఉత్తర కొరియా పరోక్షంగా ఈ యుద్ధంలో భాగస్వామి కావాలని చూస్తోందని.. ఇది అమెరికాపై నేరుగా తలపడటానికి కిమ్ జోంగ్ ఉన్‌కు దొరికిన అవకాశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుండగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాల్లోని స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఈ ఘర్షణల్లో ఇరాన్ అత్యున్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇరాన్ తన తదుపరి సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీని నియమించింది.

56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ తన తండ్రి కంటే కఠినమైన వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన నియామకం వల్ల ఇరాన్ విధానాల్లో పెద్దగా మార్పు ఉండబోదని, తండ్రి బాట‌లోనే న‌డిచే అవ‌కాశం ఉంద‌ని విదేశీ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ ప్రజలు సైతం మోజ్తబా నియామకం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ ఇళ్ల నుండే ‘మోజ్తబాకు మరణం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం మోజ్తబా నాయకత్వం వల్ల పరిస్థితులు పాత పద్ధతిలోనే సాగుతాయని వ్యాఖ్యానించారు. మోజ్తబాకు లండన్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని.. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో వీటిని కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువలవుతున్నాయి.

Advertisement

Read Also: Iran War: ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో అటాక్, అమెరికా సంచలనం

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×