E-Paper
Advertisement

Tanveer Ahmed: బంగ్లా చేతిలో ఘోర ఓట‌మి…పాకిస్తాన్ ప్లేయ‌ర్లు గాజులు వేసుకోవాలంటూ

Tanveer Ahmed: బంగ్లా చేతిలో ఘోర ఓట‌మి…పాకిస్తాన్ ప్లేయ‌ర్లు గాజులు వేసుకోవాలంటూ
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అత్యంత దారుణంగా విఫలమై ఇంటిదారి పట్టిన పాకిస్తాన్, లేటెస్ట్ గా బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. తాజాగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలోకి వచ్చింది బంగ్లాదేశ్.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

పాకిస్తాన్ ఓటమిపై విమర్శలు చేసిన తన్వీర్ అహ్మద్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సంద‌ర్భంగా ( ICC Men’s T20 World Cup 2026 )  విఫలమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో కూడా తొలి వన్డేలో దారుణంగా ఓడిపోయింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ స్పందించారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు, ఇంటికి వచ్చి గాజులు వేసుకోవాలి అంటూ చురకలు అంటించారు. బలహీనమైన బంగ్లాదేశ్ జట్టు పైన ఇంత దారుణంగా విఫలమవుతారా ? కొంచమైనా మీకు సిగ్గుందా ? మీలాంటి వాళ్లతో ఐసీసీ ట్రోఫీలు ఎలా వస్తాయి ? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed).

8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నేటి నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దాకా వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి కదం తొక్కింది. ఈ మ్యాచ్లో మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 30.4 ఓవర్లు ఆడింది పాకిస్తాన్. ఈ క్రమంలో కేవలం 114 పరుగులు మాత్రమే సాధించింది. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. కేవలం ఫరహాన్ ఒక్కడే 27 పరుగులు చేయగా చివరలో వచ్చిన ఫహీమ్ అష్రాఫ్ 37 పరుగులతో రాణించాడు.

Advertisement

ఇక మిగిలిన ఆటగాళ్లందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 115 పరుగుల లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో చేదించింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిత్ హసన్ తమీం 67 పరుగులతో రాణించగా నజబుల్ 27 పరుగులు చేశాడు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఈజీ విజయాన్ని నమోదు చేసుకుంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెటర్లు గాజులు తోడుక్కోవాలని పరువు తీశారు.

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×