E-Paper
Advertisement

Iranian Celebrations: ఇరాన్ సుప్రీం ఖమేని మృతి.. రోడ్లపై ఇరానియన్ల సంబరాలు, కొత్త నేత ఎవరు?

Iranian Celebrations: ఇరాన్ సుప్రీం ఖమేని మృతి.. రోడ్లపై ఇరానియన్ల సంబరాలు, కొత్త నేత ఎవరు?
Advertisement

Iranian Celebrations: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైనట్టు ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించింది. ఈ విషయం తెలియగానే రోడ్లపైకి వచ్చి ఇరానియన్లు సంబరాలు జరుపుకున్నారు. ఇన్నాళ్లకు తమకు స్వాతంత్య్రం వచ్చిందంటూ పలువురు పేర్కొన్నారు.

ఇరాన్ సుప్రీం ఖమేలి మృతి..  రోడ్లపై ఇరానియన్ల సంబరాలు

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమైనీ మృతి చెందినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమైనీ చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. వారంపాటు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది.

ఈ విషయం తెలియగానే ఇరానియన్లు సంబరాలు చేసుకున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆనందంతో కేరింతలు కొట్లారు. ఇరాన్‌లోని కరాజ్‌ సిటీలో ప్రజలు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. 95 శాతం ఇరానియన్ల జీవితాల్లో అత్యుత్తమ రోజుగా పేర్కొన్నాడు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేసింది.

Advertisement

ఇరాన్‌కు కొత్త బాస్ ఎవరు? ఆయన వారసులున్నారా?

ఇరాన్‌కు కొత్త బాస్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఖమేనీ తర్వాత కొత్తగా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ, ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహొల్లా ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేర్లు వచ్చాయి. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబసభ్యులు మరణించినట్లు తెలుస్తోంది. ఖమేనీ వారసులు ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా? ఉంటే వారిలో ఎవరైనా పగ్గాలు చేపట్టనున్నారా?

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియన్, జ్యుడీషియరీ హెడ్ ఘోలాం-హొస్సేన్ మొహ్సెనీ-ఎజేఈ, గార్డియన్ కౌన్సిల్ నుంచి ఒకరు తాత్కాలిక కౌన్సిల్‌గా ఏర్పడతారు. ఖమైనీ తరపున వీరిలో ఒకరు బాధ్యతలు చేపడతారు. 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం కొత్త నేతను ఎంపిక చేస్తుంది. ఈ ఎన్నికలకు కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

ALSO READ:  ఇరాన్ సుప్రీం ఖమేని హతం..  ఇరాన్ మీడియా ప్రకటన

ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. ఓ వైపు అమెరికా ఆంక్షలు.. మరోవైపు ఇజ్రాయెల్‌తో ఘర్షణ కారణంగా బలహీనపడింది. తాజా యుద్ధంలో ఒక్క రోజుకే చేతులెత్తేసింది ఇరాన్. ఏకంగా ఖమైనీని మృతి చెందాడు. ఖమైనీ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 30 ఏళ్లుగా ప్రజలకు నరకం చూపించాడని, కఠినమైన ఆంక్షలు విధించాడని చెబుతున్నారు. ఖమేని ప్రభుత్వానికి ఇటీవల జరిగిన ఆందోళనల్లో దాదాపు 10 వేల మంది వరకు చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×