BigTV English

Jaishankar : డిజిటల్ చెల్లింపుల్లో భాారత్ సరికొత్త రికార్డ్.. కొవిడ్ సమయంలో భారత్ కృషి అద్భుతం..

Jaishankar : డిజిటల్ చెల్లింపుల్లో భాారత్ సరికొత్త రికార్డ్..  కొవిడ్ సమయంలో భారత్ కృషి అద్భుతం..

Jaishankar : నగదు రహిత చెల్లింపుల్లో భారత్‌ అమెరికాను అధిగమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు. అమెరికాలో మూడేళ్లలో జరిగే చెల్లింపులు మనదేశంలో ఒక నెలలో జరుగుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జై శంకర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు తయారీలో చేసిన కృషి వివరించారు. టెక్నాలజీని భారతీయులు అందిపుచ్చుకోవడంతో భారతీయుల జీవన విధానం సులభంగా మారిందన్నారు. దేశంలో అతి తక్కువ మంది మాత్రమే నగదు చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. భారత్‌లో ఒక నెలలో జరిగిన నగదు రహిత చెల్లింపులు అమెరికాలో మూడేళ్లలో జరుగుతున్నాయని ప్రకటించారు.


పశ్చిమ ఆఫ్రికా మిషన్‌లో భాగంగా జైశంకర్‌ ఉగాండా, నైజీరియాల్లో పర్యటిస్తున్నారు. భారత్‌-నైజీరియాల మధ్య సహాయ సహకారాలపై అక్కడి పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించారు. అంతకుముందు పశ్చిమ ఆఫ్రికాలోని భారత రాయబారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఆర్ధిక వ్యవస్థ కోసం ప్రసంగించారు. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ వేగంగా వృద్థి చెందుతుందని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే భారత్ లో రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయలు మెరుగవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కొవిడ్ అల్లకల్లోలం సృష్టించిందని.. అదే సమయంలో భారత్ ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించే స్థాయికి వెళ్ళిందని ఆయన గుర్తుచేశారు. పశ్చిమ ఆఫ్రికా మిషన్‌లో భాగంగా ఉగాండా, నైజీరియాల్లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ – నైజీరియాల మధ్య వ్యాపార ఒప్పందాలు, సహాయ సహకారాలపై పారిశ్రామిక వేత్తలతో జై శంకర్ చర్చించారు.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×