Fire Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెన్నే పల్లి జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి బెంగళూరు వైపుగా ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణిస్తుంది. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు బస్సు నుండి కిందికి దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.