BigTV English

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?
Advertisement

Bigg Boss 9 Promo:తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షోలో ప్రస్తుతం ఏడో వారం నడుస్తోంది. ఇప్పటికే నాలుగు వారాల్లో ఐదుగురు కంటెస్టెంట్లు ఐదవ వారంలో డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్లు బయటికి వచ్చేసారు. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి చాలామంది పోటాపోటీగా తలపడుతున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో తాజాగా హౌస్ లోకి ఇద్దరు పోలీసులు అడుగుపెట్టారు దీంతో అసలు ఏం జరుగుతోంది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా అసలు విషయం తెలిసి ఇలా సంగతి కామెంట్ చేస్తున్నారు.


బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు..

విషయంలోకి వెళ్తే సీజన్ 7 కి సంబంధించిన అమర్ దీప్ చౌదరి, అంబటి అర్జున్ లు పోలీస్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది.. మరి వీరిద్దరూ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి..? వైల్డ్ కార్డు ద్వారా వీరిద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారా.. ? లేక టాస్క్ కోసం వచ్చారా? అనేది చూస్తే.. తాజాగా బిగ్ బాస్ 9 కి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో అమర్ దీప్ చౌదరి,అంబటి అర్జున్ ఇద్దరు కూడా పోలీస్ డ్రెస్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కంటెస్టెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన అర్జున్ అంబటి..

వీళ్లిద్దరూ రావడంతోనే మేం ఎస్సై అని పరిచయం చేసుకున్నారు. అమర్ దీప్ లోపలికి ఎంట్రీ ఇవ్వడంతోనే రీతూ చౌదరి పరిగెత్తుకు వెళ్లి ఆయన్ని హగ్ చేసుకుంది. అయితే మేం పోలీసులం అని చెప్పి ఇప్పటివరకు ఎవరెవరు ఏమేం దొంగతనం చేశారో అవన్నీ బయటికి తీయాలని తెలిపారు. కానీ హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు మాత్రం మేము ఏమీ దొంగతనం చేయలేదు అంటూ బుకాయించారు. డైలాగులతో నవ్వులు పూయించిన అర్జున్,అమర్ దీప్ లు ఇద్దరు.. మేం రావడానికి మెయిన్ రీజన్ హౌస్ లో ఉన్న ఇద్దరు డాన్ లను పట్టుకోవడానికే అని చెబుతారు. వాళ్లే సైలెన్సర్ సంజనా, మాస్ మాధురి అని చెప్పడంతో వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్.. అసలు వాళ్ళు ఇక్కడ లేరు అని కంటెస్టెంట్లు అంటారు. కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ రియాక్షన్ కి కౌంటర్ ఇచ్చారు అర్జున్.. వాళ్ళిద్దరూ ఏమైనా డబ్బాలో ఉండే స్పూన్లు అనుకుంటున్నారా.. దాచి పెడితే దాగడానికి అంటూ వారి కటౌట్ ని ఉద్దేశించి మాట్లాడారు.


కిచెన్లో ఉండాల్సిన ఆహారం మొత్తం బెడ్ రూమ్ లోనే..

ఆ తర్వాత మాధురి, సంజనా ఇద్దరినీ వెతకడం కోసం అర్జున్, అమర్దీప్ ఇద్దరు హౌస్ లోకి వెళ్లి సెర్చ్ చేశారు. అప్పటికే సంజనా, మాధురి ఇద్దరు వాళ్లకి కనిపించకుండా దాక్కున్నారు. ఇక హౌస్ లో ఎవరు ఏం కొట్టేశారో చెప్పండి అని అర్జున్ అడగగా మేమేం కొట్టెయ్యలేదు అని చెప్పారు. మీరు ఏం కొట్టేశారో మాకు తెలుసు.అవన్నీ బయటికి తీస్తాం.ఒకవేళ మీరు ఏం కొట్టేసారో చెప్పకపోతే మాతోపాటే బయటికి తీసుకెళ్తాం అంటూ అమర్దీప్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు ఎవరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో వెంటనే వారందరినీ లాక్ చేసి అమర్దీప్ హౌస్ లోపలికి వెళ్లి బెడ్రూంలో వెతకడం స్టార్ట్ చేశారు.అలా వెతుకుతున్న సమయంలో ఎగ్స్,ఫ్రూట్స్ ఇలా కిచెన్ లో ఉండే ఫుడ్ ఐటమ్స్ మొత్తం అక్కడే కనిపించాయి. అలా ఇక్కడితో ప్రోమో పూర్తయింది.

also read:Music director Death: మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

హౌస్ లో ఏం జరుగుతోంది ?

అయితే హౌస్ లోకి అమర్ దీప్, అంబటి అర్జున్ ఇద్దరు ఎంట్రీ ఇవ్వడంతో కథ పూర్తిగా మారిపోయింది. మరి వీళ్ళు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారా ? హౌస్ లోనే ఉంటారా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.కానీ టాస్క్ లో భాగంగా వీరిద్దరూ పోలీస్ గెటప్స్ లో వచ్చారని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అమర్దీప్ చౌదరి, అర్జున్ అంబటిలు పోలీస్ గెటప్స్ లో హౌస్ లోకి రావడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.ఇక హౌస్ లో ఏం జరిగింది.. వాళ్ళు ఎందుకు వచ్చారు.. హౌస్ లోనే ఉంటారా అనేది తెలియాలంటే కచ్చితంగా పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

దొంగలను పట్టుకోవడమే లక్ష్యంగా..

అమర్దీప్ చౌదరి,అంబటి అర్జున్ ఇద్దరు సీజన్ 7 లో కంటెస్టెంట్స్ గా వచ్చారు. ఇక సీజన్ 7 కప్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అవ్వగా.. రన్నరప్ గా అమర్దీప్ చౌదరి నిలిచారు. అయితే బిగ్ బాస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ రావడం చాలా కామన్ గా మారిపోయింది.ఇప్పటికే బిగ్ బాస్ లోకి వచ్చి తమ ఆట తీరుతో మెప్పించిన ఎంతోమంది కంటెస్టెంట్లు మళ్ళీ హౌస్ లోకి వచ్చారు. కొంతమందేమో కంటెస్టెంట్లుగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే మరి కొంతమందేమో హౌస్ లో ఉన్న వారి గేమ్ గురించి రివ్యూలు చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చారు.మరి వీరు ఏ కేటగిరీనో తెలియాల్సి ఉంది.

Related News

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Bigg Boss Thanuja : స్టార్ మా సీరియల్ బిడ్డ కాబట్టి తనుజ ను అంతలా లేపుతున్నారా? బిగ్ బాస్ చీకటి కోణం 

Madhuri Thanuja : రాజు అంటూనే మాధురికి నమ్మకద్రోహం, మనం కొన్ని కొన్ని నటించాలి

Big Stories

×