Rohit Sharma: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య అడిలైడ్ ( Adelaide Oval, Adelaide) వేదికగా ఇవాళ రెండో వన్డే జరుగుతోంది. అయితే ఇందులో మంచి టచ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ( Rohit Sharma ), గాయం చేసుకున్నాడు. అనవసరంగా పరుగుకు వెళ్లి, రనౌట్ కాకుండా కాపాడుకునేందుకు డైవ్ చేశాడు. ఈ సందర్భంగా అతని మోచేతికి తీవ్రమైన గాయమైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు బ్లీడింగ్ కూడా అయింది. బ్లీడింగ్ జరిగినా కూడా ఏమాత్రం తగ్గకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ డైవింగ్ చేసి రనౌట్ కాకుండా కాపాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో అతనికి గాయం కూడా కావడం అతని అభిమానులను కలవర పెడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో 97 బంతులో 73 పరుగులతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
37-year-old Rohit Sharma dived to save his wicket and got injured 🥺🐐 pic.twitter.com/zG9PtDwxdM
— GBB Cricket (@gbb_cricket) October 23, 2025