E-Paper
Advertisement

Lee Sun-kyun : డ్రగ్స్ కేసు.. ఆస్కార్ అవార్డు గ్రహీత అనుమానాస్పద మృతి..

Lee Sun-kyun : డ్రగ్స్ కేసు.. ఆస్కార్ అవార్డు గ్రహీత అనుమానాస్పద మృతి..
Advertisement

Lee Sun-kyun : ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా పారాసైట్ లో నటించిన సౌత్ కొరియా నటుడు లీ సన్-క్యూన్(48).. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌత్ కొరియా రాజధాని సియోల్ లోని ఒక పార్క్ లో ఉన్న వాహనంలో లీ సన్-క్యూన్ అపస్మారక స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఒక సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది.

లీ సన్-క్యూన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రఖ్యాత కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2001లో లవర్స్ అనే టీవీ షో ద్వారా తెరంగేట్రం చేసిన ఆయన.. పారాసైట్ లో సంపన్నుడిగా నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమా.. ఉత్తమ విదేశీ చిత్రం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమా, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. లీ సన్-క్యూన్ చివరిగా ఈ ఏడాది విడుదలైన స్లీప్ చిత్రంలో కనిపించారు.

Advertisement

కాగా.. ఒక డ్రగ్స్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటుడిగా ఎంతోమంది అభిమానాన్ని పొందిన ఆయన.. డ్రగ్స్ కేసు వల్ల కొన్ని ప్రాజెక్టులను కోల్పోయినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లో కేసు విచారణకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న తన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×