BigTV English

Negative news about twitter : ట్విటర్‌పై అసత్య ప్రచారం వెనుక రాజకీయ కుట్ర..!

Negative news about twitter : ట్విటర్‌పై అసత్య ప్రచారం వెనుక రాజకీయ కుట్ర..!

Negative news about twitter : ట్విటర్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలోనే మొదటి స్థానంలో ఉండేది. కానీ ఎలన్ మస్క్.. ట్విటర్ అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్న తర్వాత ట్విటర్ గురించి రోజుకు ఒక నెగిటివ్ ప్రచారం టెక్నాలజీ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. ముందుగా మస్క్ ట్విటర్‌ను కొన్న వెంటనే కంపెనీలో తనపై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం మొదలయ్యింది. ఇక ఇప్పుడు లే ఆఫ్స్ విషయంలో మరోసారి ట్విటర్‌పై వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ట్విటర్ గురించి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.


ట్విటర్ గురించి బయటికి వస్తున్న వార్తలు చాలావరకు అసత్య ప్రచారాలను టెక్ దిగ్గజాలు అంటున్నారు. ఈ అసత్య ప్రచారం వల్ల ట్విటర్‌లో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు బయటికి రావడం లేదని వారు చెప్తున్నారు. ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు ట్విటర్ ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారని వారు గుర్తుచేశారు.

ఒకప్పుడు వైద్య రంగంలోని పలు విషయాలు తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్విటర్‌ను స్క్రోల్ చేస్తే చాలు.. ప్రతీ విషయాన్ని తెలుసుకునే సౌలభ్యం వచ్చేసింది. పైగా అవి నేరుగా వైద్యుల తెలిపిన విషయాలు కావడంతో చదివే వారు కూడా పూర్తి విశ్వాసంతో నమ్మగలుగుతున్నారు. వైద్య రంగంలోనే కాదు సైన్స్‌లో కూడా ఎన్నో ముఖ్య విషయాలు కూడా ట్విటర్ ద్వారా బయటపడుతున్నాయి.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 368 మిలియన్ ప్రజలు ట్విటర్‌పై ఆధారపడుతున్నారు. అందుకే ప్రపంచమంతా ట్విటర్‌పై ఆధారపడుతుందని టెక్ దిగ్గజాలు గర్వంగా చెప్తున్నారు. అయితే ట్విటర్‌పై అప్పుడు, ఇప్పుడు వస్తున్న అసత్య ప్రచారాలన్నీ రాజకీయంగా సృష్టించినవే అని వారు కొట్టిపారేశారు. ఇంకా ఈ అసత్య ప్రచారాలకు కారణాలు ఏంటో వారు పూర్తిగా చెప్పకపోయినా.. అవన్నీ నిజాలు కాదని వారు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్ పాలిసీల్లో మార్పులు వచ్చినా.. అది మన మంచికే అని ఎలన్ మస్క్‌ను సపోర్ట్ చేస్తున్నారు పలువురు ప్రముఖులు.

Follow this link for more updates : Bigtv

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×