E-Paper
Advertisement

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…
Advertisement

IND vs NZ: రాయపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలోనే చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు. కివీస్ ఆటగాడు షిప్లే, శాంటర్న్ చెరో వికెట్ తీశారు. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 24న ఇండోర్‌లో జరగనుంది.

Advertisement

అంతకుముందు.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి కుప్పకూలిపోయారు.

న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు చేశారు. ష‌మీ, సిరాజ్‌కు తోడు ఆల్‌రౌండ‌ర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయ‌డంతో కివీస్ కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుంద‌ర్ వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బ‌కొట్టాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×