E-Paper
Advertisement

Nicholas Maduro: యూఎస్‌ కోర్టులో కొత్త ట్విస్ట్ ఇచ్చిన నికోలస్.. తాను యుద్ధ ఖైదీని అంటూ స్టేట్‌మెంట్

Nicholas Maduro: యూఎస్‌ కోర్టులో కొత్త ట్విస్ట్ ఇచ్చిన నికోలస్.. తాను యుద్ధ ఖైదీని అంటూ స్టేట్‌మెంట్
Advertisement

Nicholas Maduro: వెనెజుయెలా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను ఆపరేషన్‌ అబ్జల్యూడ్ రిజాల్వ్ పేరుతో ఎత్తుకొచ్చేసింది అమెరికన్ ఆర్మీ. ఆ తర్వాత న్యూయార్క్‌ కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో ఇక ఈ కేసులో లీగల్ బ్యాటిల్ మొదలైంది. ఇక మదురో కోర్టు, జైలు మధ్య చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. అయితే మదురోను పదవి నుంచి దింపేసి.. నిర్బంధించడం వెనక అమెరికా చెబుతున్న కారణం డ్రగ్ ట్రాఫికింగ్. అమెరికాలోకి వస్తున్న కొకైన్‌కు కేరాఫ్‌ వెనెజుయెలానే అంటోంటి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అయితే కోర్టు ముందు ఈ వాదనలన్నింటిని కొట్టి పారేశారు నికోలస్ మదురో. అంతేకాదు ఇప్పుడు కోర్టు ముందు కొత్త వాదనను తీసుకొచ్చారు.

తాను నేరం చేసిన ఖైదీని కాదు.. యుద్ధ ఖైదీని అంటున్నారు నికోలస్ మదురో. నిజానికి ఇది ఎవరూ ఊహించని వాదన. ఎందుకంటే ఈ వాదనను అమెరికా కోర్టులు, ప్రపంచ దేశాలు, ఇంటర్నేషనల్ కోర్టు పరిగణలోని తీసుకుంటే ఈ కేసు కథ మొత్తం మారిపోతుంది. యుద్ధ ఖైదీని అనే పదం చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే తనకు మద్దతిచ్చే దేశాలు, తన మద్దతుదారులకు ఈ పదం ఓ కొత్త అస్త్రాన్ని ఇస్తుంది. ఎండ్ రిజల్ట్‌ ఏం మారే అవకాశం లేకపోయినా.. అమెరికా చేసిన పని ముమ్మాటికి తప్పే అని వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలా కనిపిస్తోంది ఇప్పుడు మదురో వ్యవహారం.

Advertisement

వెనెజుయెలాపై అమెరికా యుద్దం చేసింది.. ఆ యుద్ధంలో తనను బలవంతంగా నిర్బంధించారు.. యుద్ధ ఖైదీగా మార్చి తనను తన దేశం నుంచి కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు.. ఇది ఇప్పుడు కోర్టు ముందు నికోలస్ చేస్తున్న వ్యాఖ్యలు. వీటిని ఒకవేల కోర్టులు పరిగణలోకి తీసుకుంటే.. ఫస్ట్ ఈ విచారణ నార్మల్ కోర్టుల్లో జరగదు. ఇది నిజమని తెలితే న్యాయ చిక్కులు తప్పవని హెచ్చరించడం, దౌత్య పరంగా చిక్కులు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు యుద్ధ ఖైదీగా భావిస్తే.. నికోలస్‌ను జెనివా ఒప్పందాలకు అనుగుణంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వ్యక్తిగత ఆరోపణలు చేసే అవకాశం ఉండదు.. విచారణ పూర్తి చేసి న్యాయమూర్తి శిక్ష విధించే అవకాశం కూడా ఉండదు. ఇన్ని ఇష్యూస్‌ ఉన్నాయి కాబట్టే.. నికోలస్‌ తెలివిగా యుద్ద ఖైదీని అని ప్రకటించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.

అమెరికా మాత్రం నికోలస్ మదురో మాత్రమే కాదు.. అతని కుటుంబం మొత్తాన్ని ఈ కేసులో ఇరికించేసింది. ఇప్పుడు కాదు.. 1999 నుంచి మదురో కుటుంబం అనేక డ్రగ్ కార్టల్స్‌తో సంబంధాలు పెట్టుకొని.. డ్రగ్స్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని చెబుతోంది అమెరికా. ఇందులో మదురో, ఆయన భార్య, కొడుకుది కూడా కీలకపాత్ర అని చెబుతోంది. కొలంబియా FARC, మెక్సికో సినోలా, జీటస్ కార్టల్, ట్రెన్ డి అరాగ్వా గ్యాంగ్‌తో కలిసి మదురో ఫ్యామిలీ డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తుందనేది అమెరికా ఆరోపణ. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. ఈ సంస్థలన్నింటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది అమెరికా.

Advertisement

Also Read: వరంగల్ జిల్లాలో విషాదం.. ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..

తమ దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు వెనెజుయెలా కేంద్రంగా డ్రగ్స్‌ సరఫరాకు పూర్తిగా సహకరించారంటోంది అమెరికా. లాజిస్టిక్ సపోర్ట్ అందించింది వెనెజుయెలా ప్రభుత్వమే అని.. అందుకే 2013లో అధ్యక్షుడైన తర్వాత చాలా లబ్ధి పొందారంటోంది. నికోలస్ భాయ్ కూడా డ్రగ్ ట్రాఫికింగ్‌ కోసం మకిక్ బ్యాగ్స్‌ పొందారని చెబుతోంది. అందుకే క్రిమినల్‌ కేస్‌గా పరిగణించి విచారణ జరపాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు నికోలస్ మదురో. వెనెజుయెలా అధ్యక్షుడిగా ఉన్న తన అడ్డు తొలగించుకునేందుకు చేస్తున్న తప్పుడు ఆరోపణలని కౌంటర్ ఇస్తున్నారు.

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×