E-Paper
Advertisement

Viral Video: దొంగకు నరకయాతన.. చోరీకి వచ్చి ఇలా చిక్కుకుపోయాడు, చివరికి..

Viral Video: దొంగకు నరకయాతన.. చోరీకి వచ్చి ఇలా చిక్కుకుపోయాడు, చివరికి..
Advertisement

Viral Video: రాజస్థాన్ లోని కోటాలో ఒక వింత చోరీ ఘటన వెలుగు చూసింది. పవన్ అనే వ్యక్తి ఒక ఇంట్లోకి దొంగతనానకి వెళ్తూ.. గోడకున్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో అడ్డంగా ఇరుక్కుపోయాడు. యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు, గోడలో ఇరుక్కున్న దొంగను చూసి షాక్‌కు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని బయటకు తీసి అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసు అధికారి వద్దే డ్రైవర్‌గా పనిచేస్తుండటం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. ఎవరూ లేని ఇంట్లో దొంగతనం చేయడానికి పథకం వేసుకున్న ఓ దొంగ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. అయితే రంధ్రం మధ్యలో ఇరుక్కుపోయాడు. లోపలి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. సుమారు గంటపాటు కన్నంలోనే ఉండిపోయాడు. ఇంతలో ఇంటికి వచ్చిన యజమాని కిచెన్ లో ఉన్న ఎగ్జాస్ట్ రంధ్రంలో వేలాడుతూ కనిపించిన దొంగను చూసి, అతను పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement

Also Read: ’కిడ్నీ అమ్ముకుందామన్నా కుదరలేదు‘.. ప్రాణం తీసుకోవడానికి టవర్ ఎక్కిన బెట్టింగ్ బాధితుడు!

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×