E-Paper
Advertisement

రణరంగంగా మారిన నగరాలు.. పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి, 200 మందికి పైగానే

రణరంగంగా మారిన నగరాలు.. పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి, 200 మందికి పైగానే
Advertisement

Pakistan Army: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రణరంగంగా మారింది. అక్కడి ప్రజలు వివిధ అంశాలపై చేస్తున్న ఆందోళనను ఉక్కుపాదంతో అణిచి వేయాలని భావించింది. ఫలితంగా పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది పౌరులు మృతి చెందారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు అక్కడి ప్రజల సమస్యలేంటి? ఎందుకు పాక్ పాలకులు కొరడా ఝులిపిస్తున్నారు?

పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి

Advertisement

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలు తిరుగుబాటు చేశారు. సబ్సిడీకి పిండి, విద్యుత్ అందించాలని, వీఐపీ సంస్కృతిని రద్దు చేయాలని కోరుతూ ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ నేతృత్వంలో సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఏడాది నుంచి ఆ కమిటీ వివిధ రూపంలో ఆందోళనలు చేస్తోంది. అయినా సరే పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

వచ్చే నెల 27న అసెంబ్లీ ఎన్నికల్లో శరణార్థులకు 12 సీట్లు కేటాయించడంపై స్థానికుల నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి సుమారు 14 వేల మంది సైన్యాన్ని రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కమిటీ నేతలను సైన్యం టార్గెట్ చేసింది.

Advertisement

పీఓకేలో ప్రజా ఉద్యమం, అణిచివేసేందుకు పాక్ సైన్యం రకరకాల కుట్రలు?

కీలక నేతలను హత మార్చడం, అర్ధరాత్రి వేళ నిర్బంధించడం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరసన కారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టింది పాక్ సైన్యం. ఈ కాల్పుల్లో 30 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది వరకు గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మిర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, రావాలాకోట్ ప్రాంతాల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. మృతుల్లో పిల్లలు, మహిళలు, యువతీ యువకులు ఉన్నారు. మృతుల సంఖ్య సుమారు 30 మంది మరణించారని చెబుతున్నా, అనధికారిక లెక్కల ప్రకారం చెప్పిన సంఖ్యకు నాలుగైదు రెట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

ALSO READ: మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత

దాదాపు 500 మందికి ప్రజలను సైనికులు అరెస్టు చేశారని స్థానిక నాయకులు చెబుతున్నారు. ప్రజలపై కాల్పులు చేయడాన్ని అక్కడి సైన్యం సమర్థించుకుంటోంది. అక్కడి ప్రజలు గెరిల్లా తరహా దాడులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని అధికారులు సమర్థించుకుంటున్నారు.పరిస్థితి గమనించిన పాక్ సైన్యం.. హింస చెలరేగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను గా నిలిపి వేసింది.

అయినా అక్కడి ప్రజలు ఏ మాత్రం తగ్గలేదు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ అస్త్రాలను బయటపెట్టింది. తప్పుడు సమాచారం, ఫేక్ వీడియోలను ప్రచారం చేయడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇస్లామాబాద్ పాలకులు చేస్తున్న ప్రయత్నం ఇదేనని ఎద్దేవా చేసింది.

 

Related News

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

Big Stories

Advertisement
×