E-Paper
Advertisement

స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!

స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!
Advertisement

Budget Smartphones: ఈ రోజుల్లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే రూ.30-40 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే బడ్జెట్ ధరలోనూ అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లతో కొన్ని ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ ను ఆకట్టుకునే విధంగా నాణ్యమైన కెమెరా, బ్యాటరీ, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అవి లభిస్తున్నాయి. రూ. 15,000 బడ్జెట్ లో అలాంటి టాప్-5 మెుబైల్స్, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

iQOO Z10x 5G

కాలేజీలో ఫ్రెండ్స్‌తో కలిసి గేమింగ్ ఆడటానికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ బడ్జెట్‌లో అత్యుత్తమ గేమింగ్ ప్రాసెసర్, అదిరిపోయే డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఇందులో ఉన్నాయి. హెవీ యూసేజ్‌లోనూ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు మంచి కూలింగ్ సిస్టమ్ ను సైతం దీనికి అందించారు. ఫ్లిప్ కార్ట్ లో రూ.13,700కు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy M17 5G

Advertisement

ఫోన్‌లో సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా చూసే వారికి ఇది పర్ఫెక్ట్. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. మంచి బ్రాండ్ వాల్యూతో పాటు ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఈ ఫోన్ లో లభిస్తాయి. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ.15 వేలకు లభిస్తోంది.

Vivo T4x 5G

కాలేజీ స్టూడెంట్స్ స్టైలిష్ ను లుక్ ను, బ్యాటరీ బ్యాకప్ ను ఎక్కువగా కోరుకుంటారు. అలాంటి వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇది స్లిమ్ డిజైన్‌తో చూడటానికి ఎంతో ప్రీమియంగా కనిపిస్తుంది. రోజంతా సినిమాలు, సోషల్ మీడియా చూసినా దీని బ్యాటరీ అస్సలు తగ్గదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Poco M7 Pro 5G

Advertisement

తక్కువ ధరలో అద్భుతమైన ఫోటోలు తీయాలనుకునే స్టూడెంట్స్.. ఈ ఫోన్ ట్రై చేయవచ్చు. ఇందులో 50MP ఓఐఎస్ కెమెరా ఉంది. దీనివల్ల చేతులు వణికినా సరే ఫోటోలు, వీడియోలు బ్లర్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి.

Also Read: ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!

Moto G45 5G

ఫోన్‌లో యాడ్స్, అనవసరమైన బ్లోట్‌వేర్ యాప్స్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇష్టపడే వారికి మోటోరోలా బెస్ట్ అని చెప్పవచ్చు. దీని పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటూ.. కాలేజ్ టాస్క్‌లు, అసైన్‌మెంట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Also Read: స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితులకు జగన్ పరామర్శ, ప్రభుత్వంపై రుసరుసలు

 

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×