BigTV English

Pakistan stealth Fighter J-35 : తింటానికి తిండే లేదు.. పాక్ కు యుద్ధ విమానాలు కావాలంటే.. 40 ఫైటర్ జెట్ల కొనుగోలుకు రెడీ..

Pakistan stealth Fighter J-35 : తింటానికి తిండే లేదు.. పాక్ కు యుద్ధ విమానాలు కావాలంటే.. 40 ఫైటర్ జెట్ల కొనుగోలుకు రెడీ..

Pakistan stealth Fighter J-35 : ఆర్థిక కష్టాలతో ప్రజలు తినేందుకు గోధుమ పిండిని సైతం సరఫరా చేయలేకపోతున్న పాకిస్థాన్.. తన సైన్యానికి ఆధునిక యుద్ధ విమానాలు కావాలని తహతహలాడుతోంది. విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో నెట్టుకొస్తూ.. రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతూనే.. సైన్యం నీడలో రోజులు గడుపుతోంది. ఇప్పటికిప్పుడు.. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సహా.. పాశ్చాత్య దేశాల డబ్బులు విదల్చకపోతే పూట గడవని స్థితిలోనూ.. సైన్యాన్ని సంతృప్తి పరిచేందుకు.. యుద్ధ విమానాలు కావాలంటూ చర్చలు జరుపుతోంది. పైగా.. 40 అత్యాధునిక ఐదో తరం ఫైటర్ జెట్ల కోసం ప్రయత్నాలు చేస్తోందంట. ఈ విషయం బయటకు రావడంతో.. పాకిస్థాన్ పరిస్థితులకు, చేస్తున్న పనులకు సంబంధం ఉందా అని చర్చించుకుంటున్నారు.. అంతర్జాతీయ విశ్లేషకులు. ఇంతకీ.. పాక్ కోరుకుంటున్న ఫైటర్ జెట్లు ఏంటి. ఏ దేశంతో చర్చలు జరుపుతుందో తెలుసా…


సైన్యం కూర్చోమంటే కూర్చోవాలి, నిలుచుమంటే నిలుచుకోవాలి. లేదంటే… ప్రధాని పదవైనా మూడునాళ్ల ముచ్చటే. పైగా.. కేసులు, అరెస్టులతో జైల్లో మగ్గాల్సిన పరిస్థితులు. అందుకే.. అక్కడి నాయకులు నోరుమూసుకుని పాక్ సైన్యం చెప్పినట్లు చేస్తుంటారు. ఆ కోవలోనే తాజాగా మరో ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి ఏకంగా.. చైనాకు చెందిన జే-35 రకానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల కోసం డ్రాగన్ చేశంతో చర్చలు జరుపుతోంది.

ప్రస్తుతం అమెరికా దగ్గరే అత్యాధునిక ఐదో తరానికి చెందిన యుద్ధవిమానాలు ఉండగా.. ఆ తర్వాత చైనా దగ్గర జే-35 అనే ఐదో తరానికి చెందిన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో.. జే-35 అనేది రెండో తరానికి చెందిన విమానంగా చెబుతున్నారు. కాగా.. పాక్ తన దగ్గరున్న పాతతరం అమెరికా తయారీ ఎఫ్-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో… ప్రస్తుత జే-35 రకం ఫైటర్ జెట్స్ ను వినియోగించాలని పాక్ ఆలోచిస్తోంది.


ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే.. కేవలం రెండేళ్లల్లోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్ లను అందించాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటి వరకు చైనా దగ్గర మాత్రమే ఉండగా.. పాక్ రెండో దేశంగా గుర్తింపు పొందుతుంది. పైగా..బీజింగ్ చేపట్టనున్న అతిపెద్ద ఆర్మీ ఫైటర్ జెట్ల ఎక్స్ పోర్ట్ గా నిలిచిపోనుంది. ఇప్పటికే.. చైనా ఆయుధ పరిశ్రమ ఈ జెట్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులోని ఏ పరికరాన్ని, టెక్నాలజీని వేరే చోట నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకపోవడంతో.. అత్యంత వేగంగా ఒప్పందాన్ని ముగించవచ్చని భావిస్తున్నారు.

జే-35ఏ యుద్ధ విమానం గురించి..

చైనా ఉత్పత్తి చేస్తున్న జే-35A అనేది ట్విన్-ఇంజిన్, సింగిల్-సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీ-రోల్ ఫీచర్లు కలిగిన స్టెల్త్ ఫైటర్ జెట్. అయితే ఈ ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ.. పాక్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోద ముద్ర వేసిందని తెలుస్తోంది.

J-35A డిజైన్ US లాక్‌హీడ్ మార్టిన్ F-35 మాదిరిగానే ఉంటుంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. ఎఫ్ – 35 సింగిల్ ఇంజిన్ కాగా, జే-35 ఏ ట్విన్ ఇంజిన్ జెట్ ఫైటర్. అయితే.. ఈ విమానాన్ని ఆమెరికా నుంచి కాపీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి చైనా.. ఇతర దేశాలకు చెందిన ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు సహా.. మిగతా వాటిని రివర్స్ ఇంజినీరింగ్ వంటి పద్ధతిలో కాపీ చేస్తుంటుంది. ఇది కూడా ఇలాంటిదే అని చెబుతున్నారు.

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం

పాక్ ఇప్పుడో అప్పుల దేశం, ఇతర దేశాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకుల బెయిల్ అవుట్ ప్యాకేజీలతో మనుగడ సాగిస్తోంది. అయితే ఇంత భారీ డీల్‌కు ఎలా నిధులు సమకూరనే విషయంలో స్పష్టత లేదు. కొంత మంది రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాకిస్తాన్ కు మరొక రుణం రూపంలో ఈ ఫైటర్ జెట్లను అందిస్తుందని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే బీజింగ్ నుంచి చాలా అప్పులు తీసుకుంది. ఈ అప్పుల్ని తీర్చలంటే.. ఎప్పుడో ఒకప్పుడు జాతీయ ఆస్తుల్ని, దేశంలోని మరో భాగాని విక్రయించాల్సి ఉంటుని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్‌లో జుహై నగరంలో వార్షిక వైమానిక ప్రదర్శనలో J-35A స్టెల్త్ ఫైటర్‌ను చైనా మొదటి సారిగా ప్రదర్శించింది. అప్పుడు.. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు ప్రదర్శనను సందర్శించి.. చైనా సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×