BigTV English

Apple M5 Chip : కొత్త చిప్ సెట్ కు యాపిల్ గ్రీన్ సిగ్నల్.. ఇకపై ప్రాసెసర్ మరింత వేగంగా!

Apple M5 Chip : కొత్త చిప్ సెట్ కు యాపిల్ గ్రీన్ సిగ్నల్.. ఇకపై ప్రాసెసర్ మరింత వేగంగా!

Apple M5 Chip : టెక్‌ దిగ్గజం యాపిల్‌ ​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యాపిల్​లో ఏ సిరీస్​, ఎమ్​ సిరీస్​ చిప్స్​తో కలగలిపిన system on a chip (SoC) ప్రాసెసర్​ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ డిజైన్​ సీపీయూ (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్​), జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్​) ను ఒకే చిప్​లో ఇంటిగ్రేడ్​ చేస్తుంది. యాపిల్ ఈ రెండింటిని కలగలపడం ద్వారా దాని డివైసెస్​ పనితీరు, అందులోని ప్రాసెసర్ స్పీడ్ ను మెరుగుపరుచుకుంది. ఇప్పటి వరకూ యాపిల్ డివైజస్ లో ఇదే ప్రాసెస్ కొనసాగగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ఈ టెక్ దిగ్గజం.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఓ కొత్త కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. తన డివైసెస్​లో ఓ మేజర్ ఛేంజ్ చేయబోతుందట. యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కు (Ming-Chi Kuo) ఈ విషయాన్ని వెల్లడించింది. అప్​కమింగ్​ M5 ప్రో చిప్​లో ఈ మేజర్ ఛేంజ్ ఉండబోతుందట. యాపిల్​ ఇంటిగ్రేటెడ్​ SoC డిజైన్​ను మార్చబోతుందట. కొత్త డిజైన్​లో సీపీయూ, జీపీయూను వేరు వేరుగా డిజైన్ చేయబోతుందట ఈ కంపెనీ.

ఆ రెండు కారణాల వల్లే –


ఈ మేజర్​ ఛేంజ్​ను చేయడానికి రెండు కారణాలు ఉన్నాయట. మరింత మెరుగైన పనితీరు, మెరుగైన ఉత్పత్తి కోసం యాపిల్ ఈ నిర్ణయం తీసుకుందట. సీపీయూ, జీపీయూను వేరు చేయడం వల్ల యాపిల్​ టీఎస్​ఎమ్​సీ లేటెస్ట్ చిప్​ ప్యాకేజింగ్ టెక్నాలజీని (SoIC-mH) తీసుకునే అడ్వాంటేజ్ ఉంటుంది.

ఈ అడ్వాన్స్​డ్​ ప్యాకేజింగ్ చిప్​సెట్స్​ థెర్మల్​ పెర్​ఫార్మెన్స్​ను మెరుగుపరుస్తుంది. అంటే చిప్​ ఓవర్​హీటింగ్ అవ్వకుండా ఎక్కువ కాలం పాటు మన్నికంగా పనిచేస్తుంది. అలాగే దీని వల్ల చిప్స్​ తయారీ ప్రక్రియలో లోపాలను తగ్గించడంతో పాటు అధిక నాణ్యత చిప్స్​ను అందించవచ్చు.

ఈ కొత్త డిజైన్​ కేవలం ఎమ్​ 5 ప్రోకు మాత్రమే కాదు, ఎమ్​ 5 మ్యాక్స్​, ఎమ్ ​5 అల్ట్రా వేరియంట్స్ లోనూ ఉపయోగపడుతుంది. ఈ హై ఎండ్ చిప్స్​ను అడ్వాన్సడ్​ చిప్​ మ్యాన్యుఫ్యాక్చరింగ్​ ప్రాసెస్ అయిన టీఎస్​ఎమ్​సీ N3P నోడ్​ ద్వారా తయారు చేస్తారు. ఎమ్​ 5 చిప్​ 2025 ప్రథమార్థంలో, ఎమ్​ 5 ప్రో, ఎమ్​ 5 మ్యాక్ ఆ తర్వాత ఏడాది, ఎమ్​ 5 అల్ట్రా 2026లో లాంఛ్ చేసే అవకాశముంది.

ఇకపోతే ఈ ఏడాదిలోనే యాపిల్‌ తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాంకేతికతను తన డివైజుల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో యాపిల్ ఏఐ తప్పుడు సమాచారాన్ని అందించి తీవ్రంగా విమర్శలను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు యాపిల్​ తన ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను కూడా మరింత మెరుగుపరిచే దిశగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైందని తెలిసింది. ఎమ్​ 5 ప్రో చిప్​, యాపిల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్​తో పని చేయనున్నాయని తెలిసింది. టెక్ పరిశ్రమలో పనితీరు, సామర్థ్యం, ఉత్పత్తి సవాళ్లను సమతుల్యం చేయడంలో పెరుగుతున్న సంక్లిష్టతను కూడా తగ్గించడానికి యాపిల్​ ప్రయత్నాలు చేస్తోంది. ఇక రాబోయో యాపిల్ గ్యాడ్జెట్స్ లో సైతం కొత్త చిప్ సెట్స్ రాబోతున్నాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ :

ఓకే వాట్సాప్ నెంబర్ ను రెండు డివైజస్ లో వాడొచ్చా..!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×