Christmas 2024: క్రిస్టమస్ పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది బహుమతులు, సాంటాక్లాజ్ కథలు, క్రిస్టమస్ ట్రీ.. ఈ పండుగ రోజు కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కి, ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఫెస్టివల్‌కి ఆఫీసుల్లో కూడా సీక్రెట్ సాంటా ఆడుతుంటారు. మీరు కూడా ఆ గేమ్ అడుతున్నారా.. వారికి ఎలాంటి గిఫ్ట్‌లు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా.. మీకోసం కొన్ని ఐడియాలు తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేకప్ ప్రొడక్ట్స్..
ప్రస్తుతం రోజుల్లో మేకప్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కాబట్టి మేకప్ ఉత్పత్తులను గిఫ్ట్‌గా ఇవ్వండి. మార్కెట్లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అవి మీ బడ్జెట్ కూడా అనుకూలంగా ఉంటాయి. మీ గిఫ్ట్‌ను చూసి చాలా ఆనందంగా ఫీలవుతారు.
మంచి సువాసన గల క్యాండిల్స్
మంచి సువాసన గల కొవ్వుత్తులు ఇంటి వాతావరణాన్ని అందంగా మారుస్తాయి. లావెండర్, రోజ్, వనిల్లా ఫ్లీవర్ వివధ రకాల సుగంధల్లో మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటివి బెస్ట్ గిఫ్ట్‌గా నిలుస్తుంది.
పుస్తకాలు..
పుస్తకాలను గిఫ్ట్‌గా ఇవ్వడం ఎంతో విలువైన భావన.. మీకు నచ్చిన పుస్తకాన్ని కానీ, డైరీని కానీ సెలక్ట్ చేసి, మీ మనలులోని సందేశాన్ని రాసి ఇవ్వండి.. ఇలాంటి బహుమతులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.
Also Read: హెన్నాలో వీటిని కలిపి హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది తెలుసా..
స్మార్ట్ వాచ్‌లు
స్మార్ట్ వాచ్‌లు బహుమతి ఇవ్వడం చక్కటి ఆలోచన. ఈ గిఫ్ట్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం రకరకాల ఫ్యూచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్‌లు తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
చాక్లెట్, డ్రై ఫ్రూట్స్
చాక్లెట్ అండ్ డ్రైఫ్రూట్స్ గిఫ్ట్‌గా ఇవ్వడం మంచి ఆలోచన. ఇది బెస్ట్ బహుమతిగా నిలుస్తుంది.
ల్యాప్ టాప్ బాగ్స్..
ఎంతో ఉపయోగకరంగా ఉండే .. ల్యాప్ టాప్ బ్యాగ్‌ని గిఫ్ట్ ఇచ్చారంటే.. చాలా ఆనందంగా ఫీలవుతారు. ఇది కూడా బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.