E-Paper
Advertisement

Modi Meloni Selfie: మరోసారి ‘మెలోడీ’ ట్రెండ్.. మోదీ, మెలోనీ సెల్ఫీ వీడియో వైరల్

Modi Meloni Selfie: మరోసారి ‘మెలోడీ’ ట్రెండ్.. మోదీ, మెలోనీ సెల్ఫీ వీడియో వైరల్
Advertisement

Modi Meloni Selfie: జీ7 సదస్సులో ‘మెలోడీ’ మూమెంట్ కనిపించింది. భారత్, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ మరో సారి సెల్ఫీ దిగగా.. మెలోడీ ట్యాగ్ పేరుతో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మెలోడీ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. ప్రధానితో తీసుకున్న సెల్ఫీ వీడియోను మెలోనీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.

ఇటలీలోని అపులియా వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ స్వాగతం పలికారు. కొద్దిసేపటి వీరి సంభాషణ అనంతరం మోదీతో మెలోనీ సెల్పీ తీసుకున్నారు. సెల్ఫీ వీడియోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Also Read: జీ7 సమ్మిట్.. వివిధ దేశాల సుప్రీమ్స్‌తో ప్రధాని మోదీ భేటీ..

గతేడాది డిసెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దుబాయ్ వేదికగా జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయింది. మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ గతంలో కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతే కాకుండా దానికి మెలోడీ అనే హ్యష్ ట్యాగ్‌ను జత చేశారు. అప్పటి నుంచి మెలోడీ అనే పదం ట్రెండ్ అయ్యింది. అప్పటి ఆ ఫోటోపై మోదీ కూడా స్పందించారు. స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని బదులిచ్చారు.

Advertisement

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×