BigTV English

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..

PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 17వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 18న ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ. 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్వవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.


పీఎం కిసాన్ పథకం 17వ విడత విడుదలైన తర్వాత కృషి శాఖలుగా గుర్తింపు పొందిన 30 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర వ్వవసాయ, రైతు సంక్షేమ శాఖ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వ్యవసాయ మంత్రి చౌహాన్ పేర్కొన్నారు.


అదనంగా, రైతులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ వంద రోజుల ప్రణాలికతో కూడిన బాధ్యతలను ఇచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

జూన్ 10న మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకం 17వ విడత నిధులు విడుదలపై తొలి సంతకాన్ని చేశారు. దీంతో ఈ పథకం ద్వారా మొత్తం 903 కోట్ల రైతులకు లబ్ది చేకూరుతుంది.

Also Read: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా సంవత్సరానికి 6 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. మొత్తం మూడు సమాన వాయిదాల్లో అంటే ప్రతి వాయిదాకు రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది.

Tags

Related News

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Street Dog Attack: OMG!.. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిపై వీధికుక్క దాడి.. వీడియో చూస్తే..

Big Stories

×