BigTV English

G7 Summit 2024: జీ7 సమ్మిట్.. వివిధ దేశాల సుప్రీమ్స్‌తో ప్రధాని మోదీ భేటీ..

G7 Summit 2024: జీ7 సమ్మిట్.. వివిధ దేశాల సుప్రీమ్స్‌తో ప్రధాని మోదీ భేటీ..

G7 Summit 2024: జీ7 సమ్మిట్‌లో భాగంగా ఇటలీ ప్రధాని మెలోని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. ఈ రోజు మోదీ పలు దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశాలు నిర్వహించారు.


ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో నిర్వహించిన సమావేశంలో రెండు దేశాల మధ్య రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణం, సంస్కృతి వంటి రంగాలపై రెండు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ చర్చించారు. వీరిరువురూ గ్లోబల్, ప్రాంతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రధాని మోదీ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ 3.0 ప్రభుత్వ పాలనలో రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సునాక్‌తో భారత ప్రధాని మోదీ తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌లతో సమావేశమైన తర్వాత, G7 సమ్మిట్‌ 2024 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీని కలిశారు. రష్యా దాడిని అరికట్టేందుకు స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో భారత్‌లో చేరాలని జెలెన్స్‌కీ ఒత్తిడి చేయడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రధాని మోదీకి జెలెన్స్కీ వివరించినట్లు సమాచారం. గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. కాగా ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి భారతదేశం డిప్లొమసీ ఆవశ్యకతను నిరంతరం వాదిస్తూనే ఉంది.

ఇక ఇటలీలోని అపులియా నగరంలో జూన్ 13 నుంచి జూన్ 15 వరకు 50వ జీ7 సమ్మిట్ జరుగుతుంది. జీ7 సమ్మిట్‌లో భాగంగా ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, అమెరికా, జపాన్ దేశ అధ్యక్షులు సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు. భారత్ జీ7లో భాగం కానప్పటికీ ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు గురువారం ఇటలీ చేరుకున్నారు,.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×