BigTV English

Biden’s Son Hunter: ఎన్నికల వేళ.. బైడెన్‌కు ఊహించని షాక్.. దోషిగా తేలిన కొడుకు హంటర్‌!

Biden’s Son Hunter: ఎన్నికల వేళ.. బైడెన్‌కు ఊహించని షాక్.. దోషిగా తేలిన కొడుకు హంటర్‌!

Biden’s son Hunter: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న జో బైడెన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తుపాకీ కొనుగోలు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో బైడెన్ కొడుకు హంటర్ దోషిగా తేలాడు. ముఖ్యంగా హంటర్‌పై మోసిన అభియోగాల్లో నేర నిర్ధారణ అయ్యింది. అయితే న్యాయస్థానం శిక్షా కాలాన్ని మాత్రం వెల్లడించలేదు.


ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం డెలావెర్‌లోని విల్మింగ్టన్ కోర్టు హంటర్ నేరాన్ని నిర్థారించిం ది. అయితే ఇలాంటి కేసులో దాదాపు 25 ఏళ్ల వరకు జైలుశిక్ష పడనుంది. మొదటిసారి కావడంతో తక్కువ శిక్ష పడవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నమాట. ఎప్పటి నుంచి శిక్ష అమలు చేసేదీ కూడా చెప్ప లేదు. తీర్పు వెలువడిన వెంటనే హంటర్ భావోద్వేగానికి గురయ్యారు.

కేసు విచారణ సందర్భంగా బైడెన్ వైఫ్, హంటర్ తల్లి జిల్ బైడెన్ కోర్టుకు వచ్చారు. న్యాయస్థానం తీర్పు తర్వాత అక్కడి అక్కడి నుంచి భార్య, తల్లితో కలిసి హంటర్ వెళ్లిపోయాడు. మాట్లాడాలని మీడియా రిక్వెస్ట్ చేసినప్పటికీ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. తీర్పును అంగీకరిస్తున్నానని, కొడుకు తరపున క్షమాభిక్ష కోరబోనని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.


Also Read: ఘోర విషాదం.. 49 మంది మృతి

ఇంతకీ అసలు కేసు ఏంటి? 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్‌కు ఇచ్చిన పేపర్‌లో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తన వద్ద అక్రమంగా ఆయుధాలు లేవని వెల్లడించారు. అది ముమ్మాటికీ తప్పుగా వర్ణించింది న్యాయస్థానం. ఇదే కాకుండా హంటర్‌పై మరో కేసు కూడా ఉంది. కాలిఫోర్నియాలో పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణకు రానుంది.

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×