BigTV English

Contractor Suicide: వైసీపీపై పందేలు.. కోట్లలో అప్పు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య!

Contractor Suicide: వైసీపీపై పందేలు.. కోట్లలో అప్పు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య!

Contractor Venkata Subbarao Suicide: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ జరిగిందన్న విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు చేతులు మారాయి. టీడీపీ పై బెట్టింగ్ వేసిన వారికి కాసుల వర్షం కురిస్తే.. వైసీపీపై పందెం కాసిన వారు నిండా మునిగిపోయారు. అలా వైసీపీపై బెట్టింగ్ వేసి.. ఉన్న డబ్బులే కాకుండా అప్పులు చేసి మరీ కోటాను కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. వైసీపీకి చెందిన కీలక నేతలకు డబ్బులిచ్చిన ఆయన.. అప్పు ఇచ్చినవారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ప్రొద్దుటూరుకు చెందిన కాంట్రాక్టర్ వెంకట సుబ్బారావు (52) విజయవాడలోని కృష్ణాబ్యారేజీలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


జూన్ 7న ఇంటి నుంచి వెళ్లిన సుబ్బారావు.. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటిరోజు కుటుంబ సభ్యులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మంగళవారం ఉదయం విజయవాడ కృష్ణాబ్యారేజీలో మృతదేహం ఉందని సమాచారం ఉండటంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడిని సుబ్బారావుగా గుర్తించారు. అతనివద్ద కొన్ని ఫోన్ నంబర్లతో ఉన్న ఒక లెటర్ కనిపించింది. నా పేరు సుబ్బారావు. మాది ప్రొద్దుటూరు.. ఈ నంబర్లకు దయచేసి ఫోన్ చేయండి అని అందులో రాసి ఉంది. ఆ లెటర్ లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారుమునిరెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఉన్నాయి.

Also Read: CM Chandrababu: విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశం


వైసీపీపై కోట్ల రూపాయల పందేలు, కోట్లలో అప్పులు చేయడమే కాకుండా.. గెలుపు ఓటములపై మధ్యవర్తిగా ఉండి పందేలు వేయించినట్లు తెలుస్తోంది. ఓడినవారు డబ్బులివ్వకపోవడంతో గెలిచిన వారి నుంచి డబ్బుల కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం. అందుకే సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×