Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, హక్కుల కార్యకర్త మరియా కెరీనా మచాడోని వరించింది. నోబెల్ శాంతి పురస్కారం కోసం డోనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రపంచ యుద్ధాలను ఆపానని, తనకు శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ చేసుకున్న సిఫార్సులను నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు.
డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని కోల్పోయినప్పటికీ.. ఈ అవార్డును గెలుచుకున్న మరియా కెరీనా కీలక ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి పోరాడుతున్న వెనిజులా ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మరియా ప్రశంసించారు. తన శాంతి బహుమతిని ట్రంప్ నకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
“వెనిజులా ప్రజల పోరాటానికి ఈ గుర్తింపు ఒక ప్రోత్సాహకం. మనం విజయం అంచున ఉన్నాం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన మిత్రదేశాల మద్దతు ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను” అని మరియా కొరీనా ఎక్స్ లో ట్వీట్ చేశారు. “నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రజలకు, మా లక్ష్యానికి మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను” అని ఆమె అన్నారు.
మరియా కొరీనా ప్రజాస్వామ హక్కులను సాధించడానికి పోరాటం చేశారు. వెనిజులా నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం కృషి చేస్తున్నారు. ఆమె పోరాటాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించింది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల అనంతరం మరియా ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్నారు. కొన్నాళ్లు ఆమె అజ్ఞాతంలో గడిపినప్పటికీ, తిరిగి ప్రతిపక్షాన్ని ఏకం చేసి ప్రస్తుత పాలనపై పోరాడుతున్నారు.
తనకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించాలని డోనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మాజీ అమెరికా అధ్యక్షులు థియోడర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాల సరసన తన పేరు ఉండాలని ట్రంప్ ఆశించారు.
ప్రపంచ వ్యాప్తంగా “ఎనిమిది యుద్ధాలను” పరిష్కరించినందుకు శాంతి బహుమతిని గెలుచుకోవడానికి తాను అర్హుడని పదే పదే ట్రంప్ చెప్పుకున్నారు. అయితే మరినాకు నోబెల్ శాంతి బహుమతి రావడం డొనాల్డ్ ట్రంప్ ను అంతగా బాధించదని అన్నారు. ఇటీవల వెనిజులాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలపై మదురోకు వ్యతిరేకంగా ట్రంప్ అన్ని దౌత్య ప్రయత్నాలను నిలిపివేశారు.
అయితే ట్రంప్ చర్యలు దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా ఒత్తిడి చేస్తోందనే ఊహాగానాల మొదలయ్యాయి. నిజానికి మదురోను పట్టుకుంటే అమెరికా తన బహుమతిని 50 మిలియన్లకు రెట్టింపునుక చేరింది. ట్రంప్ నిర్ణయానికి ఆగస్టులో మచాడో కృతజ్ఞతలు తెలిపారు.
“వెనిజులాలో చట్టవిరుద్ధమైన పాలనను కూల్చివేసేందుకు, కీలక నిర్ణయం తీసుకున్నందుకు వెనిజులా ప్రజలు, అధ్యక్షుడు ట్రంప్, అతని పరిపాలనకు ధన్యవాదాలు” అని ఆమె ట్వీట్ చేసింది. ట్రంప్ పాలనను వెనిజులా అధ్యక్షుడు మదురోను “అమెరికన్ న్యాయం నుండి పారిపోయిన వ్యక్తి” అని పిలుస్తుండగా, ట్రంప్ అతన్ని డ్రగ్ కార్టెల్ నాయకుడిగా అభివర్ణించారు. మదురోపై ట్రంప్ తీసుకున్న చర్యలు మచాడో ప్రశంసలు అందుకుంది.
ప్రజాస్వామ్య హక్కుల పోరాటానికి వెనిజులా ఉక్కు మహిళ మచాడో చేసిన కృషికి టైమ్ మ్యాగజైన్ ‘2025లో 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు జాబితాలో ఆమె పేరును పొందారు.
Also Read: Nobel Prize Peace: ట్రంప్‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?
మచాడో వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. మదురో నిరంకుశ పాలనను ధిక్కరిస్తున్నారు. మరియా ఎన్నో బెదిరింపులను ఎదుర్కోవడమే కాకుండా, అరెస్టై ప్రయాణ నిషేధాలు, రాజకీయ హింసను కూడా ఎదుర్కొన్నారు. నోబెల్ కమిటీ మచాడోను… ధైర్యసాహసాలు, నిబద్ధతను ప్రశంసించింది.