Australia Plane Crash: ఆస్ట్రేలియాలో విమానం ప్రమాదం జరిగింది. రన్ వే పై విమానం కుప్పకూలింది. న్యూ సౌత్ వేల్స్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీకి 85 కి.మీ దూరంలో ఉన్న షెల్హార్‌బోర్ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
“విమానం నేలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాపక విభాగం మంటలను అదుపుచేసింది” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తుంది.
న్యూ సౌత్ వేల్స్ పోలీసుల ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. నేలను వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. న్యూసౌత్ వేల్స్ అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రన్ వే పై కాలిపోయిన విమానం శిథిలాలు ఈ వీడియోల్లో కనిపించాయి.
ఆ విమానం న్యూ సౌత్ వేల్స్‌లోని బాథర్స్ట్‌కు వెళ్తుంది. ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్‌ను ఆండ్రూ కానర్స్‌గా పోలీసులు గుర్తించారు. బయలుదేరిన తర్వాత తగినంత ఎత్తుకు విమానం చేరుకోలేక ఒక్కసారిగా రన్ వే పై కూలిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో తెలిపారు. రన్‌వేపై క్రాష్ అయిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ATSB) దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. ఈ ఘటన విషాదకరమని చీఫ్ ఇన్‌స్పెక్టర్ వుండర్‌లిచ్‌ను మీడియాతో తెలిపారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తుస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నట్లు తెలిపారు.
Also Read: US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన
ఫైర్ అండ్ రెస్క్యూ NSW ఇన్‌స్పెక్టర్ ఆండ్రూ బార్బర్ మీడియాతో మాట్లాడుతూ.. “తక్షణ సహాయం చేసేందుుకు విమానాశ్రయంలో ఆర్ఎఫ్ఎస్ యూనిట్ ఉన్నప్పటికీ విమానంలోని వారిని రక్షించే అవకాశం లేకపయింది. ఎయిర్ కాఫ్ట్ వేగంగా రన్ వే ను ఢీకొట్టడంతో ఇంధనం నుంచి మంటలు చెలరేగాయి” అని చెప్పారు.