Americal News: అమెరికాలో గన్ కల్చర్ అక్కడివారిని బెంబేలెత్తిస్తోంది. రెండు లేదా మూడు రోజుల కొకసారి తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని లేలాండ్ సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ పాఠశాల సమీపంలో ఈ ఘటన కాల్పుల్లో స్పాట్‌లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 12 మందికి గాయపడగా, వారిలో కొందరు పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు సమాచారం.
అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికా కాలమాన ప్రకారం.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పిలోని లేలాండ్ నగరంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే కార్యక్రమం జరిగింది. అమెరికన్ సంప్రదాయ ఫుట్‌బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్‌లు జరిగాయి. ఫుట్‌బాల్ గేమ్ ముగిసిన తర్వాత 18 ఏళ్ల యువకుడు గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో స్పాట్‌లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 12 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నమాట. కాల్పుల ఘటనతో ఆ స్కూల్ వేడుక కాస్త విషాదంగా మారింది. ఫుట్‌బాల్ గేమ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతోపాటు స్థానికులు ఆ సమయంలో గుమిగూడారు.
ఆరుగురు మృతి, డజనుకుపైగా గాయాలు
ఆ సమయంలో ఓ యువకుడు కాల్పులు జరిపారు. దాదాపు 20 మంది గాయపడ్డారని ఆ రాష్ట్ర సెనేటర్ తెలిపారు. తీవ్రంగా గాయపడినవారిని సమీపంలోని గ్రీన్‌విల్లే ఆసుపత్రి నుండి జాక్సన్‌లోని మరో ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని నగర మేయర్ తెలిపారు. ఈ ఘటనలో దర్యాప్తును కొనసాగుతోంది.
ALSO READ: జపాన్ లో విజృంభిస్తున్న ఫ్లూ మహమ్మారి
నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆ తరహా ఘటనలు జరగలేదని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు ఆ పాఠశాల్లో కనపించలేదు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
లేలాండ్ నగరంలోని ఓ పాఠశాల సమీపంలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు
నలుగురు మృతి, 12 మందికి గాయాలు pic.twitter.com/HQCNqlIg9Z
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2025