California: కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం తప్పింది… ఆకాశంలో తిరుగుతు ఒక్కసారిగా చెట్లమీదకు వెళ్లి కుప్పకూలిపోయింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని హంటింగ్ టన్ బీచ్‌లోని ఒక బిజీ ఓషన్‌ఫ్రంట్ పార్కింగ్ లాట్‌లో అక్కడే జరుగుతున్న ఒక ఈవెంట్ సమీపంలో గాల్లో తిరుగుతూ కూలిపోయిన హెలికాప్టర్ ఘటన గత శనివారం మధ్యాహ్నం 2:09 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం పసిఫిక్ కోస్ట్ హైవే (PCH), బీచ్ బుల్వర్డ్ మధ్యలో, ట్విన్ డాల్ఫిన్స్ డ్రైవ్, హంటింగ్ టన్ స్ట్రీట్ మధ్య జరిగింది. ఈ ప్రాంతం హయాట్ రీజెంసీ హంటింగ్ టన్ బీచ్ రిసార్ట్ అండ్ స్పా, వాటర్‌ఫ్రంట్ బీచ్ రిసార్ట్ వంటి హోటళ్లు ,బీచ్ యాక్సెస్ పార్కింగ్ లాట్‌లకు దగ్గరగా ఉంది.
ఈ ఘటన సమయంలో అక్కడ వేలాది మంది బీచ్‌గోవర్లు, టూరిస్టులు “కార్స్ ‘ఎన్’ కాప్టర్స్ ఆన్ ది కోస్ట్” అనే ఈవెంట్‌కు సంబంధించిన ప్రేక్షకులు ఉన్నారు. ఈ ఈవెంట్ హంటింగ్ టన్ బీచ్ పోలీస్ అండ్ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు మద్దతుగా హెలికాప్టర్లు, ఎగ్జాటిక్ కార్ల షోకేస్‌గా జరుగుతుంది.. అయితే దాని VIP ల్యాండింగ్ పార్టీ శనివారం జరిగింది. బెల్ 222 మోడల్ హెలికాప్టర్ గాల్లో హోవరింగ్ చేస్తుండగా, తల రోటర్ ఫెయిల్యూర్ కారణంగా అది అకస్మాత్తుగా క్లాక్‌వైజ్ దిశలో తిరిగి మొదలైంది. ఐ టిమోతీ బార్ట్లెట్ అనే టిక్‌టాక్ యూజర్ హెలికాప్టర్లు ల్యాండింగ్ చేస్తున్న వీడియో చిత్రీకరిస్తుండగా, ఈ ఘటనను క్యాప్చర్ చేశాడు. వీడియోల్లో హెలికాప్టర్ గాల్లో కొన్ని సార్లు తిరిగి, పామ్ చెట్లు, పీడెస్ట్రియన్ బ్రిడ్జ్ మీద కూలిపోయింది.
Also Read: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ
అయితే హెలికాప్టర్ చెట్లలో చిక్కుకుని, బ్రిడ్జ్ స్టెయిర్స్ మధ్యలో ఉంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ప్రేక్షకులు భయంతో కేకలు వేస్తూ పరిగెత్తారు. అక్కడి స్థానికులు “ఇది భయంకరంగా ఉంది, మేము అక్కడే ఉండి చూస్తుండగా ఇది జరిగింది” అని చెప్పారు. ఈ ప్రమాదంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు వ్రేకేజీ నుంచి సురక్షితంగా రక్షించబడ్డారు. నేలపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. హంటింగ్టన్ బీచ్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, అందరిని హాస్పిటల్‌కు తరలించారు.. ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.. దీని పై ఇంకా పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గాల్లో గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. VIDEO
అమెరికా-దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ బీచ్ సమీపంలో ఘటన
అందరూ చూస్తుండగానే గింగిరాలు తిరుగుతూ కూలిపోయిన ఓ హెలికాప్టర్
అక్కడే ఉన్న చెట్లలో కూలి పడిపోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు
హెలికాప్టర్‌లోని ఇద్దరికి, నేలపై ఉన్న… pic.twitter.com/hkVyFXhblj
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2025