America: అగ్రరాజ్యం అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. అయితే మిలిటరీ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో షాక్ గురైన మిలిటరీ సిబ్బంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి ఒక్కసారిగా ఎగిరిపడ్డ కార్లు..
ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు అన్ని ధ్వంసం అయ్యాయి. అక్కడి ఉన్న కార్లు మంటలకు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు జరిగిన ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్నంతా కమ్మేసింది. దీంతో అధికారులు మృతులను గుర్తించలేకపోతున్నారు..
Also Read: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన FBI
దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని హిక్ మాన్ కౌంటీకు చెందిన అధికారి డేవిడ్ స్టీవార్ట్ తెలిపారు. ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని తాకుతోందని.. మంటలను అదుపుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం అని చెప్పిన అధికారులు..
భారీ పేలుడు.. 19 మంది మృతి..
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని ఓ మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఘటన
పేలుడు ధాటికి ఒక్కసారిగా ఎగిరిపడ్డ కార్లు
సీసీ కెమెరాల్లో పేలుడు దృశ్యాలు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన FBI pic.twitter.com/81Ewv51Zsz
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2025