E-Paper
Advertisement

Qatar LNG Plant: యుద్ధం ముగిసినా.. గ్యాస్ కష్టాలు నాలుగేళ్లు తప్పవా? భారత్ పరిస్థితి ఏంటి?

Qatar LNG Plant: యుద్ధం ముగిసినా.. గ్యాస్ కష్టాలు నాలుగేళ్లు తప్పవా? భారత్ పరిస్థితి ఏంటి?
Advertisement

Qatar LNG Plant: యుద్ధం ముగిసినా దాని  ప్రభావం కొన్నాళ్లుపాటు ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభ వేదికగా వెల్లడించారు. ఆయన మాటలు అక్షరాలా నిజమే. ఎందుకంటే ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగినా, ఎల్‌పీజీ గ్యాస్ రావడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే LNG ప్లాంట్‌ దెబ్బతినడమే అందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసినా గ్యాస్‌కు కష్టాలు. 

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు ప్రపంచదేశాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాయి. ఆ యుద్ధం ప్రభావం అన్నింటి కంటే ఎక్కువగా ఆసియాపై ఎక్కువగా కనిపిస్తోంది. హోర్మూజ్ జలసంధికి తెరవడానికి రావాలని మిత్రులకు తమతో కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావాలని పదే పదే కోరినా ఏ మాత్రం ఫలితం లేదు. ఎందుకంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థలు పతనం తప్పదని భావిస్తున్నాయి.

ఖతార్‌లోని రాస్ లాఫాన్ LNG ప్లాంట్‌కు నిలయం. ప్రపంచంలోనే అతి పెద్దది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఆ ప్లాంట్‌లో రెండు ప్రధాన ఉత్పత్తి విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాలు ఉత్పత్తికి కీలకం. అయితే వాటిని తిరిగి కార్యకలాపాలకు అనుకూలంగా మార్చడానికి చాలా కాలం పట్టే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఖతార్ గ్యాస్ ప్లాంట్ ఉత్పత్తికి నాలుగేళ్లు తప్పవని  ఎనర్జీ కంపెనీ నివేదిక

శీతలీకరణ కంప్రెషర్ల కోసం కొత్తగా భారీ గ్యాస్ టర్బైన్‌లు అవసరమవుతున్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ టర్బైన్‌‌కు తయారు చేసే దేశాలకు ఆర్డర్ల భారీగా ఉన్నాయి. వాటిని ఆపి ఖతార్ గ్యాస్ రిఫైనరీ కోసం తయారు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన పని. ఒకవేళ టర్బైన్‌లను తయారు చేసి వాటిని ప్లాంట్‌కు అమర్చే ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుందని అంటున్నారు.

అందుకోసం రెండు లేదా నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని ఓ ఎనర్జీ తయారీ కంపెనీ నివేదిక చెబుతోంది. ఈ లెక్కన ఎటుచూసినా ఖతార్ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ రావాలంటే రెండు లేదా నాలుగేళ్లు సమయం పట్టే అవకాశముందని అంటున్నారు. అప్పటివరకు ఆసియా దేశాలకు కష్టాలు తప్పవన్నమాట.

ALSO READ: ఖార్గ్ ఐలాండ్‌‌ ఆపరేషన్‌కు అమెరికా ప్లాన్? భారీగా ఇరాన్ బలగాలు, ఆ భయం..

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురుపై అత్యధికంగా ఆధారపడే దేశాలు ఈ విధంగా ఉన్నాయి. అందరి కంటే జపాన్ అత్యధికంగా 73 శాతం గల్ఫ్ నుంచి వెళ్లాలి. ఆ తర్వాత సౌత్ కొరియా-70 శాతం, ఇండియా-42 శాతం, చైనా-45, పాకిస్థాన్, తైవాన్ లు-60, థాయ్‌లాండ్-35, సింగపూర్-30, మలేషియా-30 శాతం ఉన్నాయి. ఫిలిప్పీన్-25, ఇండోనేషియా-25, వియత్నాం-20, ఇటలీ-15, స్పెయిన్ 15, అమెరికా రెండు నుంచి ఐదు శాతం వరకు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే గల్ఫ్ మండిపోతోంది.. హోర్ముజ్ ఊపిరాడటం లేదు.

ఇప్పుడు ప్రతీ దేశం చమురుపై రష్యా, అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక భారత్ విషయానికి వద్దాం. రీసెంట్ ప్రధాని మోదీ మాట్లాడుతూ ఒకప్పుడు చమురును 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని,  ప్రస్తుతం 41 దేశాలకు పెంచినట్టు తెలిపారు.  రష్యా, ఆఫ్రికా, సౌత్ అమెరికా నుంచి భారత్‌కు గ్యాస్ రావాల్సి వుంటుంది. ఖర్చు కూడా పెరుగుతుందన్నమాట. ఎలాగ చూసినా ధరలు పెరగడం ఖాయం.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×