E-Paper
Advertisement

Rajamouli: హాలీవుడ్‌కు జక్కన్న.. అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్

Rajamouli: హాలీవుడ్‌కు జక్కన్న.. అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్
Advertisement

Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. దాదాపు రూ. 1200 కోట్లను వసూల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకులు కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. తాజాగా రాజమౌళికి ‘అవతార్’ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. హాలీవుడ్‌లో సినిమాలో చేసే ఉద్దేశ్యం ఉంటే తనను సంప్రదించాలని కోరారు.

అమెరికాలో ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌కు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేమ్స్ కామెరూన్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను తాను రెండు సార్లు చూసినట్లు కామెరూన్, రాజమౌళికి చెప్పారు. సినిమా తనకు ఎంతో నచ్చిందని అన్నారు. మూవీలోని పాత్రలను చూస్తుంటే విభిన్నమైన అనుభూతి కలిగిందని, జక్కన్న చూపించిన తీరు, బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చెప్పిన విధానం తనకు ఎంతగానో నచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమాలో చేసే ఉద్దేశ్యం ఉంటే ఖచ్చితంగా తనను సంప్రదించాలని జక్కన్నను కామెరూన్ కోరారు.

Advertisement

ఇందుకు సంబంధించిన సంభాషనను అంతా వీడియో తీసి ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. కొద్దిక్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×