E-Paper
Advertisement

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో ట్విస్ట్.. తెరపైకి జూకర్ బర్గ్, మస్క్ ఫొటోలు.. డిన్నర్‌లో ఎంజాయ్ చేస్తూ..!

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో ట్విస్ట్.. తెరపైకి జూకర్ బర్గ్, మస్క్ ఫొటోలు.. డిన్నర్‌లో ఎంజాయ్ చేస్తూ..!
Advertisement

Epstein Files: ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ప్రముఖ పరిచయాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోలు తెరపైకి వచ్చాయి. ఎప్ స్టీన్ తో కలిసి వారు ఓ డిన్నర్ పార్టీలో పాల్గొన్న చిత్రాలు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇటీవల విడుదలై ఎప్ స్టీన్ ఫైల్స్ లో జుకర్ బర్గ్, మస్క్ ఉన్న ఫొటో బయటపడింది. ఎప్ స్టీన్ 2015 ఆగస్టు 3న ఈ ఫొటోను తనకు తానుగా ఈ-మెయిల్ చేసుకున్నాడు. దీనికి వైల్డ్ అనే పేరు సైతం పెట్టుకున్నాడు. వైరల్ అవుతున్న ఫొటోను గమనిస్తే.. అందులో ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అక్కడ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూర్చొని ఉన్నారు. వీరితో పాటు లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్ మన్, పేపాల్ సహ యజమాని పీటర్ థీల్ సైతం ఉన్నారు. ఈ ఫొటోను ఎప్ స్టీన్ స్వయంగా తీసినట్లు తెలుస్తోంది.

Advertisement

కొద్ది వారాల క్రితం ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. తానెప్పుడు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరుకాలేదని తేల్చిచెప్పారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎప్ స్టీన్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై లైంగిగ దాడులకు తెగబడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అదే సమయంలో వారికి సంబంధించిన ఫైల్స్ ను బయటపెట్టాలని పట్టుబట్టారు. జనవరి 31న మస్క్ దీనికి సంబంధించి ట్విట్ చేయగా.. తాజాగా అతడు కూడా ఎప్ స్టీన్ తో కలిసి ఉన్న ఫొటో బయటకు రావడం గమనార్హం.

Advertisement

Also Read: AP Telangana Water Dispute: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటి.. టెన్షన్‌లో తెలంగాణ నేతలు!

కాగా, ఇటీవల ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేరు సైతం తెరపైకి వచ్చింది. అనిల్ అంబానీ, ఎప్ స్టీన్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు ఇటీవల విడుదలైన ఫైల్స్ బయటపెట్టాయి. 2017 మార్చి 9వ తేదీన జరిగిన ఒక సంభాషన ప్రకారం.. పొడవైన స్వీడిష్ అందగత్తె.. మీ రాకను మరింత సరదాగా మార్చేస్తుందని ఎప్ స్టీన్.. అనిల్ అంబానీతో అన్నారు. దానికి అంబానీ బదులిస్తూ.. ఏర్పాట్లు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చినట్లు రీసెంట్ ఫైల్స్ వెల్లడించాయి.

Also Read: Dry Cleaning Business: బట్టలు ఇస్త్రీ చేస్తూ.. నెలకు రూ. 2,83,500 సంపాదన.. నివ్వెరపోతున్న నెటిజన్లు!

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×