E-Paper
Advertisement

హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!

హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!
Advertisement

Strait of Hormuz: పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చే మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ అనుకోకుండా వాయిదా పడింది. ఇరాన్‌తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.

హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్

Advertisement

పాకిస్థాన్‌‌ తోపాటు ఇతర దేశాల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్‌ ప్రతినిధులతో తుది ఒప్పందం దిశగా కొనసాగుతున్నామని,  ఆ ప్రయత్నాల్లో పురోగతి సాధించామని మనసులోని మాట బయటపెట్టారు. అదే సమయంలో ఇరాన్‌ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతోందని తేల్చిచెప్పారు.

ఒప్పందంపై స్పష్టత వచ్చే వరకు ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. అంతకుముందు ఇరాన్‌ బహిరంగ ప్రకటనలకు విరుద్ధంగా తమతో ఒప్పందం చేసుకునేందుకు రహస్యంగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. తాము పూర్తిస్థాయిలో పోరాటానికి దిగితే ఇరాన్ దాన్ని ఆపలేరని, ఇకనైనా లొంగిపోవాలని హెచ్చరించారు.

Advertisement

ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!

ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ నౌకలను జలసంధి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ట్రంప్‌ ఇటీవల ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రాజెక్టు ఫ్రీడమ్‌ని నిలిపివేసినందుకు ట్రంప్‌‌కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ మీడియా మేరకు యుద్ధానికి సంబంధించి 14 అంశాల అవగాహన ఒప్పందం జరగబోతోంది. ఆ తర్వాత 30 రోజుల చర్చల కాలం మొదలుకానుంది. ఈ సమయంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని చెబుతున్నాయి. ఈ అవగాహన ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమంపై తాత్కాలిక నిషేధం ఉందని సమాచారం. ఈ నిషేధం కనీసం 12 సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెబుతున్నాయి.

ALSO READ: భద్రతా స్థావరాలనే టార్గెట్ చేశారా? జలంధర్, అమృత్‌సర్‌లో పేలుళ్లు

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×