E-Paper
Advertisement

ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం, ఇద్దరు భారతీయులు మృతి

ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం, ఇద్దరు భారతీయులు మృతి
Advertisement

MountEverest Tragedy: ఎవరెస్ట్‌ శిఖరంపై ఊహించని విషాదం చోటు చేసుకుంది. శిఖరానికి చేరుకున్న దిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులు ఒకరు అరుణ్‌ కుమార్‌ తివారీ, మరొకరు సందీప్‌‌గా గుర్తించారు.

ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం

Advertisement

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌. దీన్ని అధిరోహించిన సగటు పర్వతారోహకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే ఆ శిఖరాన్ని చేరుకుని క్షేమంగా చేరుకున్నారు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో చాలామంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా బుధవారం ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు 274 మంది పర్వతారోహకుల టీమ్. అందులో ఇండియాకు చెందిన సందీప్‌ ఆరే, తులసి రెడ్డి, అజయ్ పాల్ సింగ్ తోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఒక రోజులో అధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన టీమ్‌గా కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.

Advertisement

శిఖరం తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయులు మృతి

శిఖరం నుంచి కిందకు దిగుతున్న సమయంలో సందీప్‌ ఆరే, అరుణ్‌ కుమార్‌ తివారీ మృతి చెందినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని తెలిపారు. వారిని రక్షించేందుకు గైడ్స్‌ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరణించినవారు వేర్వేరు బృందాల్లో సభ్యులు.

బుధవారం ఒకరు, గురువారం మరొకరు మృత్యువాత పడ్డారు. ఒకరు దిగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు బేస్ క్యాంప్‌కు వచ్చినప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది.. రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి

మరోవైపు శిఖరాగ్రానికి చేరుకోవడానికి పర్వతారోహకులకు తాడు బిగించే పని మే 13న పూర్తయింది. దీంతో ఈ ఏడాది అధిరోహణ సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి 493 అనుమతులు జారీ చేశారు నేపాల్ అధికారులు. ఈ ఏడాది అధిక సంఖ్యలో పర్వతారోహకులు వచ్చారు. 1953లో టెన్జింగ్ నార్గే-సర్ ఎడ్మండ్ హిల్లరీ తొలిసారి ఈ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. అప్పటి నుంచి ఒక ఏడాదిలో జారీ చేయబడిన అనుమతులలో ఇదే అత్యధికం.

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×