BigTV English

High tempaature recorded in Dubai: దుబాయ్‌లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతనో తెలిస్తే షాకవుతారు!

High tempaature recorded in Dubai: దుబాయ్‌లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతనో తెలిస్తే షాకవుతారు!

High tempaature recorded in dubai: దుబాయ్‌ని ఎండలు భయపెట్టిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ, వేడి అధికంగా ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందిస్తున్న సైంటిస్టులు ఇది అత్యంత ప్రమాదకరమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. జులై 17న ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. అక్కడి నుంచి కేవలం రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడూ లేనంతంగా నేడు ఏకంగా 62 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది అత్యంత ప్రమాదకరమంటూ సైంటిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉష్ణోగ్రతలు మానవదేహం తట్టుకునే స్థాయి నుంచి అధికంగా పెరిగిపోయిందంటున్నారు.


Also Read: మహిళకు ముద్దుపెట్టబోయిన బైడెన్.. ఇంతలోనే భార్య చూసి..

అధిక తేమ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ మానవ మనుగడపై ప్రమాదకర స్థాయిలో ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలు అధికంగా ఉండడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వేడి సంబంధ వ్యాధుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడి జనానికి స్పష్టం చేస్తున్నారు. ఇక అక్కడ ఎండలు మండిపోతుండడంతో దుబాయ్ ప్రజలు ఏసీలను, చల్లదనాన్ని ఇచ్చే ఇతర వస్తువులను అధికంగా వాడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగానే పెరిగిపోయింది. అయితే, ఈ హీట్ వేవ్ పరిస్థితులు వచ్చే నెల వరకు కొనసాగే అవకాశముందంటూ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×