BigTV English
Advertisement

Pushpa-2: అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు? నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ

Pushpa-2: అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు? నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ

Allu Arjun: పాన్ ఇండియా మూవీ పుష్ప – 2 చుట్టూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు మధ్య ఈగో విభేదాలు తలెత్తాయని, అందుకు షూటింగ్ ఆగిపోయిందని వదంతలు వ్యాపించాయి. సుకుమార్‌తో గొడవ కారణంగానే అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఫారీన్ ట్రిప్‌కు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుకుమార్ కూడా ఈగోతోనే ఫారీన్ ట్రిప్‌కు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. పుష్ప 2 సినిమా విడుదల వాయిదాకు సంబంధించి వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇస్తూ ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ మిత్రుడు బన్నీ వాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఆయ్ మూవీ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో బన్నీ వాస్ పుష్ప 2 చుట్టూ ముసురుకున్న వివాదంపై స్పష్టత ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి నవ్వుకుంటున్నామని వివరించారు. ఆ వార్తలన్నీ కట్టుకథలేనని, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

Also Read: రికార్డులు బ్రేక్ చేస్తున్న SIT మూవీ.. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఇంతలా..


పుష్ప-2 ది రూల్ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ షూటింగ్ మరో 15 నుంచి 20 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నదని, ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ ఇంకా మిగిలి వుందని బన్నీ వాస్ వివరించారు. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందామని చెప్పారని తెలిపారు. అందుకోసమే దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసుకున్నారని వివరించారు. అంతే తప్పితే అల్లు అర్జన్, సుకుమార్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అల్లు అర్జున్, సుకుమార్, తనకు మధ్య బాండింగ్ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుందని చెప్పిన బన్నీ వాస్.. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలిమ్‌ను అంత సింపుల్‌గా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×