E-Paper
Advertisement

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే
Advertisement

Trump New Bill: ఏదో విధంగా భారత్‌పై సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు అధికారం కల్పిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఓ చట్టాన్ని ఆమోదించింది. దీంతో రష్యా నుండి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్.. అమెరికా సుంకాలను ఎదుర్కోనుంది. సంతకం కోసం ఈ బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది.

రష్యా ఆర్థిక వ్యవస్థని అష్టదిగ్భందం చేసిన అమెరికా

రష్యా నుండి చమురు-గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలను విధించేందుకు ట్రంప్ కొత్త చట్టం తీసుకొచ్చింది. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. రష్యా నుండి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పిస్తుంది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థ, కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుంది అమెరికా. ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది.

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ కొత్త స్కెచ్

Advertisement

ఈ బిల్లుకు దివంగత సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు. ఎందుకంటే ఈ బిల్లు ప్రతిపాదనను రూపొందించడానికి గ్రాహంకు ఏడాదికి పైగా సమయం వెచ్చించారు. ప్రతినిధుల సభలో దీనికి అనుకూలంగా 262 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 159 ఓట్లు పడ్డాయి. ఓ స్వతంత్ర సభ్యుడి మద్దతుతో ఆమోదం పొందింది. ఏడుగురు రిపబ్లికన్లు, 152 మంది డెమోక్రాట్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. అధ్యక్షుడికి సుంకాల విధించే అధికారాలను కల్పించడంపై డెమోక్రాట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని చట్టంగా ఆమోదించడం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సభ్యులు పంపనున్నారు. రష్యా చమురు లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ఐదు అతిపెద్ద దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు.

బిల్లులో అధికారులు ఇక అధ్యక్షుడు ట్రంప్‌కే

రష్యా సహజ వాయువు ఎగుమతులలో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసుకున్న, తగ్గించుకోవడానికి చర్యలు తీసుకున్న దేశాలకు మినహాయింపు లభిస్తుంది కూడా. ఈ బిల్లు పాస్ కావడంతో భారత్-అమెరికా వాణిజ్య-ఇంధన సంబంధాలకు మరింత అనిశ్చితిని చేకూరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ సంఘర్షణ తర్వాత వాణిజ్యంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రష్యా ముడి చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా భారత్ కొనసాగుతోంది. రష్యా నుండి నిరంతరం ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాల నుండి అమెరికా చేసుకునే దిగుమతులపై భారీ సుంకాలను విధించడానికి ఈ కొత్త చట్టం ఉపయోగపడనుంది. ఈ చట్టం నేరుగా భారత్‌పై కొత్త సుంకాలను విధించనప్పటికీ భవిష్యత్తులో అలా చేయడానికి ట్రంప్‌కు మరింత చట్టపరమైన అధికారాన్ని కల్పిస్తుంది.

రష్యా నుంచి అధికంగా భారత్ చమురు దిగుమతి

Advertisement

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్-GTRI నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక ఏడాదిలో రష్యా నుండి భారతదేశం 40.8 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. భారత్ ముడి చమురు దిగుమతులలో 30.3 శాతం. 2026 జూలై నాటికి ఆధారపడటం పెరగడంతో ఆ వాటా 51 శాతానికి చేరింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ట్రంప్ ఆ అధికారాన్ని నిర్ణయించుకుంటే భారత్ కొత్త సుంకాలు వేయవచ్చు. ఈ చట్టం ప్రకారం.. మొదటి ఐదు ఇంధన దిగుమతిదారులు రష్యా ముడి చమురు లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే దేశాలపై అదనంగా 100 శాతం సుంకాలు విధించబడుతుంది .అమెరికాలోకి దిగుమతయ్యే రష్యా వస్తువులపై 500 శాతం సుంకాన్ని విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడికి అధికారం కల్పిస్తుంది. రష్యా చమురు, గ్యాస్‌పై భారత్, చైనా వంటి దేశాల ఆధారపడటాన్ని తగ్గించాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ బిల్లు ఆమోదం పొందింది.

ALSO READ: సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

Related News

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

Big Stories

Advertisement
×