E-Paper
Advertisement

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే
Advertisement

New Delhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాలకు పదును పెడుతంది. దేశవ్యాప్తంగా జనన-మరణాల నమోదుపై నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన జనన-మరణాల నమోదు సవరణ చట్టం-2026 వచ్చే నెల అనగా అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం

దేశంలో జనన-మరణాల నమోదులో జాప్యానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకోసం కొత్తగా చేసిన చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త చట్టం ప్రకారం.. పుట్టుక, మరణం వంటి వివరాల నమోదులో జాప్యం, అవకతవకలు జరగకుండా నిరోధించవచ్చు. అందుకోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలను అందులో ప్రస్తావించింది. సెక్షన్ 1 లోని ఉప-సెక్షన్ (2) ద్వారా 2026 అక్టోబర్ 1 నుంచి ఈ చట్ట అమలులోకి వచ్చినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి, ఆలస్యమైతే ఇబ్బందులు

Advertisement

నూతన సవరణ చట్టం ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, పాఠశాల ప్రవేశాలు, పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ కార్డు, వివాహ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జనన ధ్రువీకరణ పత్రాలు అత్యంత కీలకంగా మారనుంది. ఆలస్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ క్రమబద్ధీకరించడం, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడం, పారదర్శకమైన కేంద్రీకృత డాటాబేస్‌ను నిర్వహించడం ఈ చట్ట నిబంధనలను అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం.. పుట్టిన లేదా మరణించిన ఏడాది తర్వాత కానీ రెండేళ్ల లోపు కానీ నమోదు కోరుతూ చేసే దరఖాస్తులను డిఎం, ఎస్‌డిఎం లేదా అధీకృత కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు కావాలి.

ALSO READ: కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

Advertisement

నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత నమోదు ప్రక్రియ కొనసాగడానికి ముందు, అధికారి నిజా నిజాలను ధృవీకరించుకోవాలని అందులో ప్రస్తావించింది. రెండేళ్లు తర్వాత చేసే వాటి కోసం ఈ చట్టం ఉన్నత స్థాయి న్యాయ సమీక్షను ప్రవేశపెడుతుంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నుండి ఉత్తర్వును తప్పనిసరి చేసింది. జనన-మరణాల నమోదుకు సంబంధించిన విషయాల కోసం 1969 జనన మరణాల నమోదు చట్టం రూపొందించబడింది. కొత్త చట్టం ప్రకారం.. జనన మరణాల నమోదు తప్పనిసరి, ధృవీకరణ పత్రం చట్టపరమైన గుర్తింపు ఇస్తుంది. వ్యక్తి జననం లేదా మరణాన్ని నిరూపించడానికి ఈ ధృవీకరణ పత్రం సాక్ష్యంగా పరిగణిస్తారు. 2023లో ఈ చట్టాన్ని సవరించారు. సవరించిన చట్టంలోని నిబంధనలు అక్టోబర్ ఒకటి నుండి అమలులోకి రానున్నాయి.

Tags

Related News

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

Big Stories

Advertisement
×