New York: అమెరికాలోని న్యూయార్క్ సబ్‌వేలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై కూర్చున్న భారత సంతతికి చెందిన మహిళ, ఆమె స్నేహితుడు రైలు ఢీకొనడంతో స్పాట్‌లో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టడానికి ముందు ఆ మహిళ నవ్వుతూ ఆ వ్యక్తిని తన వైపుకు లాగుతున్నట్లు కనిపిస్తుంది.
అమెరిక మీడియా నివేదికల ప్రకారం.. న్యూయార్క్‌లోని ఒక సబ్‌వే స్టేషన్‌లో భారత సంతతి యువతి 24 ఏళ్ల మలైకా చిత్రె, ఆమె ఫ్రెండ్ నేపాలీ-అమెరికన్ నవం కౌల్ ఎదురుగా వస్తున్న రైలు కిందపడి మృతి చెందారు. ప్రమాదవశాత్తు కౌల్ పట్టాలపై పడిపోగా సహాయం చేయడానికి మరొకరు ప్లాట్‌ఫారమ్ పైనుంచి దూకారు. అంతలోనే రైలు పైనుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి వయస్సు దాదాపు 24 ఏళ్లు ఉంటుంది.
న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రే కాగా, ఆ ప్రాంతంలోని సేయర్‌విల్లే నివాసి నవమ్ కౌల్‌గా గుర్తించినట్లు న్యూయార్క్ డైలీ రాసుకొచ్చింది. మలైకా-కౌల్ ఇద్దరు రట్జర్స్ విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు.లోయర్ మాన్‌హాటన్ సబ్‌వే స్టేషన్‌లో వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టడానికి ముందు ఆ మహిళ నవ్వుతూ ఆ వ్యక్తిని తన వైపుకు లాగుతున్నట్లు వీడియోలో కనిపించింది. స్ప్రింగ్ స్ట్రీట్ స్టేషన్ లోపల లోకల్ ట్రాక్‌లపై నడుస్తున్న డౌన్ టౌన్ నంబర్-4 రైలు ఈ ప్రమాదానికి గురైంది.
ALSO READ: బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!
ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో ప్రమాదం గురించి తమకు సమాచారం వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని ఘటన జరిగిన ప్రాంతానికి రాకుండా నేరుగా ప్లాట్‌ఫారమ్‌పైకి తరలించారని సమాచారం. 2020-24 వరకు న్యూ బ్రన్స్‌విక్‌లోని రట్జర్స్ బిజినెస్ స్కూల్‌లో కౌల్ చదువు పూర్తి చేశారు. అయితే ఆయన డిగ్రీ పట్టా పుచ్చుకోలేదు. మరోవైపు మలైకా 2024 మేలో రట్జర్స్-న్యూ బ్రన్స్‌విక్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పని చేస్తోంది. కౌల్ బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా ఉన్నారు.
COUPLE REFUSE TO MOVE as TRAIN BEARS DOWN on MANHATTAN SUBWAY TRACKS — BOTH KILLED pic.twitter.com/MdDKSbnOL9
— RT (@RT_com) September 13, 2026