E-Paper
Advertisement

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!
Advertisement

Amazon Back to Campus 2026: అమెజాన్ బ్యాక్ టూ క్యాంపస్ సేల్ వచ్చేసింది! కాలేజ్ లేదా యూనివర్సిటీకి వెళ్లే విద్యార్థుల కోసం అమెజాన్ ల్యాప్‌ టాప్‌లు, టెక్ గాడ్జెట్‌పై ఏకంగా 40% వరకు భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. కోడింగ్, గేమింగ్ లేదా ఆన్‌లైన్ క్లాసుల కోసం బ్రాండెడ్ ల్యాప్‌ టాప్‌లను తక్కువ ధరకే కొనేయడానికి ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం హెచ్‌పి, లెనోవో, డెల్ వంటి టాప్ బ్రాండ్లపై ఉన్న అదిరిపోయే ఆఫర్లు, ధరల వివరాలు తెలుసుకుందాం.

1. హెచ్‌పి (HP 15s) ల్యాప్‌టాప్ :

ప్రోగ్రామింగ్ , కాలేజ్ వర్క్ చేసుకునే స్టూడెంట్స్‌కు HP 15s ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. ఇంటెల్ కోర్ i3 లేదా i5 ప్రాసెసర్‌తో లభించే ఈ ల్యాప్‌ టాప్ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

Advertisement

ధర: సుమారు రూ. 35,000 నుంచి రూ. 48,000 మధ్య లభిస్తోంది. సేల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు పోను మరింత తక్కువ ధరకే దీనిని కొనొచ్చు.

2. లెనోవో ఐడియాప్యాడ్ (Lenovo IdeaPad Slim 3):

స్లిమ్ డిజైన్, లైట్ వెయిట్ ,ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యూత్ కోసం లెనోవో ఐడియా ప్యాడ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ ప్రీ-ఇన్‌ స్టాల్ అయి ఉండటం స్టూడెంట్స్‌కి చాలా ప్లస్ పాయింట్.

Advertisement

ధర: బేసిక్ వేరియంట్లు సుమారు రూ.30,000 నుంచి రూ.42,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి.

3. డెల్ ఇన్‌స్పిరాన్ (Dell Inspiron Series):

డెల్ బ్రాండ్ మన్నికకు మారుపేరు. ఆన్‌లైన్ క్లాసులు, హెవీ సాఫ్ట్‌వేర్ రన్నింగ్ కోసం డెల్ ఇన్‌ స్పిరాన్ సిరీస్ ల్యాప్‌ టాప్‌లు అద్భుతంగా పని చేస్తాయి.

ధర: ఫీచర్లను బట్టి రూ.40,000 నుంచి రూ.60,000 లోపు అద్భుత మైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

4. ఆసస్ వివోబుక్ (ASUS Vivobook):

స్టడీస్‌తో పాటు అప్పుడప్పుడు గేమింగ్ ఆడాలనుకునే.. కాలేజ్ కుర్రాళ్ల కోసం ఆసస్ వివో బుక్ మంచి ఛాయిస్. ఎస్సెస్ డీప్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా దీన్ని ఈజీగా కొనొచ్చు.

ధర: ఈ మోడల్స్ సుమారు రూ.32,000 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి.

Also Read: చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేజ్‌లు చదవడం ఎలా?

స్టూడెంట్స్ సేవింగ్స్ కోసం కొన్ని చిట్కాలు:

బ్యారీ ఆఫర్లు: ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ కొంటే.. అదనంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత ల్యాప్‌ టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే కొత్త ల్యాప్‌ టాప్‌ను సొంతం చేసుకోవచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ: ఒకే సారి డబ్బు చెల్లించలేని వారికి నెలకు చిన్న అమౌంట్‌తో ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

మీరు కూడా కాలేజ్ లేదా యూనివర్సిటీకి వెళ్తుంటే.. ఈ అమెజాన్ బ్యాక్ టూ క్యాంపస్ సేల్‌ను అస్సలు మిస్ కావద్దు. మీ కోర్సుకు సరి పోయే బెస్ట్ ల్యాప్‌ టాప్‌ను బడ్జెట్ ధరలోనే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి!

Related News

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేజ్‌లు చదవడం ఎలా?

Big Stories

Advertisement
×