Delhi: న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశంలో ఏం జరుగుతోంది? చైనా అధ్యక్షుడు జెన్‌పింగ్ అదొకలా ఎందుకున్నారు? రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన డిన్నర్‌కు ఎందుకు రాలేదు? కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. చివరకు మోదీ ప్రసంగంలో అదోలా ఉన్నారా? ఏం జరిగింది.. జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దూరంగా ఉన్నారు. కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు ఇతర దేశాధినేతలు పాల్గొన్నారు. జిన్‌పింగ్ గైర్హాజరుపై చర్చ మొదలైంది. భారత్ మండపం నుంచి నేరుగా ఆయన రెస్ట్ తీసుకునేందుకు హోటల్‌కు వెళ్లనట్టు చెబుతున్నారు. సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. జిన్‌పింగ్‌తోపాటు అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సదస్సు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఆయన కూడా విందుకు గైర్హాజరయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరుగుతున్న ఈ సదస్సులో 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరయ్యారు.
అంతకుముందు భారత్ మండపంలో బ్రిక్స్ దేశాధినేతల సదస్సు ప్రారంభం సందర్భంగా అధ్యక్ష హోదాలో ప్రధాని మోదీ తొలి ఉపన్యాసం ఇచ్చారు. ఈ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అసౌకర్యంగా కనిపించారు. దీన్ని గమనించిన ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కాసేపు నిలిపి వేశారు. మాట్లాడటం ఆపేసి జిన్‌పింగ్ వైపు తిరిగి చూశారు మోదీ. అంతా ఓకేనా? అని చైనా అధినేత పక్కనున్న అనువాదకుడ్ని అడిగారు. జిన్‌పింగ్ అసౌకర్యానికి గురి కావడానికి కారణం ఏంటనేది తెలియలేదు. కొన్ని సెకన్ల తర్వాత అంతా ఓకే అన్నట్లు జిన్‌పింగ్ తల ఊపారు. దీంతో ప్రధాని మోదీ తిరిగి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఈ సన్నివేశం దూరదర్శన్ యూట్యూబ్‌లో పోస్టు చేసిన ఫుటేజీలో నమోదైంది.
ALSO READ: 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,
బ్రిక్స్ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి మాట్లాడుతున్న ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. గతేడాది తియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సమయంలో ముగ్గురు ప్రపంచ నేతలు కలుసుకున్న ఫొటో వైరల్ అయ్యాయి. ఆ తరహాలో ప్రస్తుత ఫొటోలు సైతం ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పుతిన్-జిన్‌పింగ్‌ల చేతులను ప్రధాని మోదీ పట్టుకోవడం, ముగ్గురు నేతలు కలిసి సరదాగా మాట్లాడుకోవడం వాళ్ల మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచించింది.