E-Paper
Advertisement

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!
Advertisement

UK Breakup: యూకే నుంచి వేర్పాటు కోరుతూ.. వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ దేశాల ప్రతినిధులు ఓ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. యూకే ప్రధాని ఆండీ బర్నహామ్ ప్రభుత్వం.. రాజ్యాంగ మార్పుల కోసం సిద్ధంగా ఉండాలని 3 దేశాల నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్‌మినిస్టర్ సమయం ముగింపు దశకు వచ్చిందని స్పష్టం చేశారు.

యూకే రియాక్ట్..

Advertisement

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇటీవలే ఐర్లాండ్‌లో పర్యటించారు. అవిభాజ్య ఐర్లాండ్ ఏర్పాటు గురించి మాట్లాడిన 48 గంటల్లోనే.. ఈ ఒప్పందం వెలువడటం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై యూకే రియాక్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్.. ఆండీ బర్నహామ్ యూకే ఐక్యతనే గట్టిగా నమ్ముతున్నారని, ప్రస్తుతం రాజ్యాంగ చర్చల కంటే ప్రజల జీవన వ్యయాలను తగ్గించడంపైనే ఆయన దృష్టి సారించారని తెలిపింది.

బ్రిటన్ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారు..

Advertisement

బ్రెగ్జిట్ నిర్ణయం తమకు నచ్చలేదని, తమ భవిష్యత్తు యూరోపియన్ యూనియన్‌తోనే ముడిపడి ఉందని స్కాట్లాండ్ వాదిస్తోంది. అలాగే తమ ప్రాంతంలోని చమురు సంపదపై సర్వాధికారాలు కోరుకుంటోంది. మరోవైపు.. బ్రిటన్ పాలన నుంచి విడిపోయి, పక్కనే ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో కలిసిపోవాలని.. నార్తర్న్ ఐర్లాండ్ ప్రజలు ఆశిస్తున్నారు. ఇక.. బ్రటిన్ విధానాలు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నాయని, తమ చట్టాలను తాము చేసుకుంటూ.. ప్రత్యేక భాష, సంస్కృతిని కాపాడుకోవాలని వేల్స్ కోరుకుంటోంది. ఈ మూడు దేశాలు పూర్తిగా బయటపడితే.. భవిష్యత్తులో యూకే మ్యాప్‌లో.. ఇంగ్లాండ్ మాత్రమే మిగిలిపోతుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన మహా సామ్రాజ్యం.. అంతర్గత ఒత్తిళ్లలో కూరుకుపోవడం.. ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బ్రిటన్ ప్రభుత్వాన్ని ఈ సంక్షోభం నుంచి ప్రధాని ఆండీ బర్నహామ్ ఎలా కాపాడుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Also Read: రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Tags

Related News

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

Big Stories

Advertisement
×